Saturday, February 28, 2009
పీడితజాతి లోంచే వారి విముక్తి వీరుడు ప్రభవిస్తాడు.
గురవడి పేరుచెబితే ఒకప్పుడు నలమల అంచుల్లోని పల్లె జనాలకు వణకు పుట్టేది.దుర్మార్గానికి నిలువెత్తు రూపంగా ప్రచారం కాబడ్డ గురవడు తమను పట్టించుకోని సమాజంపై ఎత్తిన తొలిపిడికిలిగా మనం అర్థంచేసుకోవచ్చు.1930 దశకంలోఅప్పటి కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నల్లకాలువ గ్రామ సమీపంలోని నల్లమలలోని రుద్రకోడు గూడెంలో గురవడు నివసించేవాడు.చెంచుల సహజ రూపానికి భిన్నంగా గురవడు ఆరడుగుల పొడవుండేవాడు.చేతిలో అంబుబద్దతో నడచివస్తుంటే ఎదుటపడడానికి మీసాలు సుళ్ళుతిరిగిన మహమహా రైతులే ధైర్యం చేసేవారు కాదు.దర్జాగా పొలాల్లోకి వచ్చి జొన్నకంకులు,కొర్రలు,ఆరికెలు మోసినన్నిపట్టుకు పోయినాగురవన్నిఇదేమని అడిగే తెంపు ఎవరికి వుండేదికాదు.సాధారణంగాచెంచులుపంటపొలాల్లోదొంగతనంగానో,కళ్ళాలవద్ద అడుక్కునో తిండిగింజలు తీసుక పోయేవారు. అలాంటిది స్వంతచేలోకొచ్చినట్లు వచ్చి అందినకాడికి దొరలా పట్టుకు పోయే గురవడిని ఎదుర్కోలేని అప్పటి పల్లెజనాలు తమ అశక్తతను కప్పి పుచ్చుకునేందుకు అతనికి అతీంద్రియ శక్తులున్నట్లు ప్రచారం చేశారు. ఆడవాల్లను ఎత్తుకు పోయి అత్యాచారానికి పాల్పడే వాడని కూడా ప్రచారం జరిగింది.మొత్తం మీద మైదాన ప్రాంతాలలొ గురువడు ఎలాగైనా హతమార్చాల్సిన రాక్షసుడుగా ప్రచారమయ్యాడు. చెంచులు అప్పుడే కాదు ఇప్పటికి కూడా మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన,వ్యభిచరించిన చరిత్ర లేదు. కానీ చెట్టున కాసిన కాయ,అడవిన పరుగెత్తె జింకలు తన ఆహారంగా దేవుడు ఏర్పాటు చేసినవేనని భావించి,వాటిపై ఇంకోడి పెత్తనమేమిటంటూ ఎవ్వరినీ లెక్క చేయని కారణంగ ఓ చెంచు వీరుడు అందరికి శతృవయ్యాడు.అలాంటి సంధర్భంలో ఓరోజు గురవడు నల్లకాలువ గ్రామానికొచ్చాడు. తనను చూసి బయపడి పక్కకు తప్పు కుంటున్న గ్రామస్తుల పిరికి తనానికి నవ్వుకుంటూ గురవడు సారాయి అంగడి వైపు మల్లాడు.అంగట్లో కూర్చున్న ఈడిగాయన్ను బెదరగొట్టి పూటుగా మందు పుచ్చుకున్నాడు.తూలుతూ చెంచుగూడెం వెళ్ళేందుకు బయలు దేరాడు.గ్రామస్తులకు ఇది సువర్ణావకాశంలా కనిపించింది. అయినా ఎదురువెళ్ళాలంటే ఎవ్వరికైనా అదురే. బలిజ నారాయణ తొలి దెబ్బ వేశేందుకు సిద్దపడ్డాడు. మిగిలినవారు తలొ దిక్కునుండి దాడి చేయడానికి సమాయత్తమ్యారు.బలిజ నారాయణ వెనుకనుండి అనుకునట్లు గానే పట్టుడు కట్టెతో తలపై బలంగా ఒక వేటు వేశాడు.ఓగావు కేక వేసి నేలకూలిన ఆగిరిజన వీరుడిని కమ్ముకున్న తక్కినవారు అతడికి ఊపిరి సలపకుండా వేటుపై వేటు వేస్తు నిర్వీర్యున్ని చేశారు. అయినా గురవడి ప్రాణం పోలేదు. నెత్తుటి ముద్దలా వున్న గురవడి శరీరాన్ని ఎద్దుల బండి చక్రాలకు కట్టి,బండిపై మనుషులెక్కి నడిపించారు. అయినా ప్రాణాలు పోని గురవడు "ఎందుకురా నన్నిలా హింసిస్తారు నాజబ్బలోతాయెత్తులున్నాయి వాటిని తొలగించనంతవరకు నకు చావులేదని తనమరణ రహస్యం తానే వివరించి ప్రాణాలు విడిచాడు. నాటి ఇంగ్లీషు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి ఊరంతాఎదురు తిరగడంతో వారు వెనుదిరిగారు.ఈ జరిగిన కథను ఇప్పటికీ పల్లెజనంవల్లె వేస్తూనే వుంటారు.అలా ఎప్పుడో స్వతంత్రించి వ్యవస్తను లెక్కచేయక తిరగబడ్డ గురవడి జీవితం అలా ముగైసింది.సరిగ్గా మరో 7౦ డెభై సంవత్సరాల తరువాత చట్టబద్దంగా చెంచుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినందుకు మరో చెంచు వీరుడు దాసరి కొండన్నదొంగ ఎదురు కాల్పుల్లో ప్రాణాలు వదలడం యాదృఛికమైతే కాదు.పీడిత వర్గాల నుండేవారి విముక్తి వీరుడు ప్రభవించడం చరిత్ర చెప్పిన పాఠమే.
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు నాయుడి ఫాసిస్టు పాలన కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు ఒక బాలింత గిరిజన స్త్రీ రొమ్ములు పిండి ఆమె పాలు కుళ్ళు చేశారు. ఎవడైనా పోలీస్ లేదా ఫారెస్ట్ ఆఫీసర్ గిరిజన స్త్రీ రొమ్ముల మీద చేతులు వేస్తే అతని చేతులు నరికే ధైర్యం గిరిజన స్త్రీకి ఉండాలి. గిరిజనులకి అంత ధైర్యం ఉంటే వాకపల్లి తరహా గ్యాంగ్ రేప్ ఘటనలు కూడా జరగవు.
ReplyDeleteచాలా మంచి విషయాలను వెలుగులోకి తెచ్చినారు.వారి బ్రతుకు దెరువులో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతెసరి. వారికోరకు ఏమి చెయ్యనవసరం లేదు.
ReplyDeleteisp administator,సమతలం గారికి నబ్లాగు సందర్సించి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
ReplyDelete-సుబ్బారెడ్డి
సర్ ! చెంచుల జీవితాలను మీరు వెలుగులోకి తెస్తున్న విధానం అభినందనీయం .కానీ ప్రభుత్వాలెన్ని మారినా వారి జీవితాల్లోకి వెలుగు రాదేమో .మీ టపాలు కొన్ని చదివేటప్పుడు మనసు కలచివేసినట్టవుతుంది .
ReplyDeleteపరిమళం గారు,
ReplyDeleteమనసులు కలిచివేయబడి మనుషులు తమతోటి వారికోసం స్పందించగలిగితే నాప్రయత్నం సఫలమైనట్టే.మీలాంటివారు సహానుభూతి చెందుతున్నారు.నేను సరైన మార్గంలోనేవెల్తున్నట్లున్నాను.
-సుబ్బారెడ్డి
సుబ్బా రెడ్డి గారు, ముందు గా ఇంత మంచి శీర్షిక అందిస్తున్నందుకు ధన్యవాదాలు. అవును పీడిత జాతి నుంచే వారి విముక్తి వీరుడు జన్మిస్తాడు... మరి పీడించబడే వారికే ముందు గా ప్రశ్నించే అధికారం వుంటుంది... మార్పు కోరుకునే మనస్తత్వం వుంటుంది... కాని పీడిత వర్గపు బాధలను.. చూసి... వాటిని మనసులో అనుభవించి వారి విముక్తికై పోరాడి ఆ పోరాటానికి చేయూత నిచ్చే మహానుభావులు అధికార వర్గం లోను లేక పోలేదు.. ఏమంటారు...
ReplyDeleteపాలక వర్గాన్ని అంత గుడ్డిగా నమ్మేయాలా? బెలూచిస్తాన్ గిరిజనులు పాకిస్తాన్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేసినట్టు నల్లమల గిరిజనులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై తిరగబడాలి.
ReplyDeleteభావన గారు,
ReplyDeleteమానవచరిత్ర ఆసాంతము వర్గపోరాటాలచరిత్రే.పాలకవర్గం పీడక వర్గంగానే ఉంటూ వస్తోంది. ఆయంత్రాంగంలో ఉంటూ పీడితుల పక్షాన మాట్లాడడం సాధ్యమయ్యే విషయం కాదు.అంతర్గత వైరుధ్యం వల్ల ఒక్కోస్సారి పాలకవర్గాలలోని కొన్ని సెక్షన్లు పీదితుల భాధలకు స్పందించినట్లు కనిపించ వచ్చు. వ్యక్తులు వర్గదృక్పదాన్ని విడిచి,పూర్తిగా పీడితవర్గాలతో మమేకమైతే తప్ప ఉపయోగం లేదు.మా(చెంచుల)బ్లాగ్ సందర్సించి మాటామంతి జరిపినందుకు ధన్యవాదాలు.
-సుబ్బారెడ్డి
ఐఎస్పీ...గారికి,
ReplyDeleteమీపేరు తెలిస్తే సంభోధన మరింత సుబగంగా వుంటుంది. మీరన్నట్లు పీడితవర్గ పక్షపాతులు కొందరిలో,పాలకవర్గాలు అవసరానికి తగిలించుకునే మానవీయ ముసుగుపట్ల బ్రమలు వున్నాయి. బలూచిస్తాన్ లా అని కాదు,పీడన లేని సమాజం కోసం పోరైతే అనివార్యమే.
-సుబ్బారెడ్డి
This comment has been removed by a blog administrator.
ReplyDeleteాశ్వనిశ్రీ గారు,
ReplyDeleteరెండు పోస్టులు వుంటే ఒకదాన్ని తొలగించబోయాను..సాంకేతికంగా నేను కొచెం బలహీనున్ని. మొత్తం రెండు పోస్టులు కనుమరుగయ్యాయి.అన్యధాభావించకండి.మీరు నాబ్లాగును సంద్ర్సిస్తూ అభ్ప్రయాలు పమ్చండి.
-సుబ్బారెడ్డి
http://telugu.stalin-mao.net/ బ్లాగ్ నాదే. జిమెయిల్ ఐ.డి.లో నా అసలు పేరు కాకుండా ప్రొఫెషన్ పేరు ఇచ్చాను, అంతే.
ReplyDeleteసుబ్బారెడ్డి గారూ, బ్లాగు చక్కగా ఉంది.
ReplyDeleteప్రజాకళ ఆగస్టు సంచికలో ఎవరో 'కరుణ' అనే ఆవిడ (?) చెంచుమహిళల గురించి రాసిన ఒక వ్యాసం/కథ/కథనం చదివాను..ఓసారి మీరూ చూడండి దాన్ని.