చెంచు జాతి హననాన్ని వేగవంతం చేసిన అభయారణ్యం----------------------------------------------------------------------ఎప్పుడో ఏకాలం నాడో ఓ తమిళుడు పచ్చటి శోభతో వెలుగుతున్న ఆ కొండలను చూసి "నల్లమలై"(మంచి కొండలు) అన్నాడు. అలా నామకరణం గావించ బడ్డ నల్లమలలు అధ్బుత మైన ప్రకృతి రమణీయతకు నేటికీ చిరునామాగా వుంటూ ఉన్నాయి.వేలాది చ.కిమీ పరిధిలొ విస్తరించిన ఈ అడవులు జీవవైవిధ్యానికి(Bio diversity) పెట్టింది పేరు.ఇక్కడ వున్నన్ని వృక్షజాతులు,జంతుజాలము,వనమూలికలు,క్రిమి కీటకాలు మరెక్కడా కనిపించవు. సింహము,ఏనుగు తప్ప వన్యజీవులైన అన్ని స్థన్యజీవులు నల్లమలలొ వుండడం విశేషం.
దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణా కేంద్రం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాయల్ బెంగాల్ టైగర్లకు నల్లమలలోనే అభయారణ్యం ఏర్పాటు చేశారు.కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దాటిన తరువాత kgరోడ్డు కు ఎడమవైపు మొదలైయ్యే నల్లమల అడవి అలాగే కృష్ణాతీరం దాటి ఆవలి ఒడ్డున వున్న మహబూబ్ నగర్ జిల్లాలోని అడవిని కలుపుకుని వేలాది చ.కి.మీ మేరా "శ్రీశైలం- నాగార్జునసాగర్" వైల్డ్ లైఫ్ సాంక్చురీ పేరుపై ఈ అభయారణ్యం ఏర్పాటైయింది. నిజానికి పులిని పర్యావరణ సూచిగా భావించవచ్చు. పులి కదలికలు,పునరుత్పత్తి,జననరేటు తదితర అంశాలు అడవి లోని మిగిలిన జంతుజాల జీవన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది.పులి దాదాపు నలభై చ.కి.మి పరిధిలో ఆధిపత్యం వహిస్తుంది.పర్యావరణ శాస్త్రవేత్తలు అడవిని మూడు ప్రధాన జోన్ల్ గా విభజిస్తారు.అవి 1.టూరిస్ట్ జోన్(జనం తమ అవసరాల కోసం తిరుగాడే గ్రామాల సమీపంలో వుండే అడవి ప్రవేశ ప్రాంతం)2.బఫర్ జోన్(గడ్డి మేసే జంతువులు తిరుగాడే ప్రదేశం)3.కోర్ జోన్( అడవి మద్యభాగము(జనసంచారంలేని దట్టమైన చోటు) పెద్దపులి కోర్ జోన్లో తన టెరటరీని స్తాపించుకుంటుంది.పులి మనుషులకు ఎప్పుడు హానికారిణి కాదు.అడవిలో పులిని మనిషి ఒకసారి చూస్తె పులి మనిషిని వేయి సార్లు చూసి ఉంటుందని జానపదుల సామెత.మనిషిని చూస్తె తప్పుకునే స్వభావం పులిలో ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ మనిషే పులిపాలిట యమదూతగామారి, వాటి సంఖ్య దారుణంగా పడిపోవాడానికి కారణమవుతున్నాడు.అయితే చిత్రంగా వేల సంవత్సరాలుగా అదే నల్లమలలో పులులతో సహజీవనం చేస్తున్న చెంచులు మాత్రం పులులకు ఏనాడూ కీడు తలపెట్టడం కానీ పులులు చెంచుల మీద దాడి చేసిన సంఘటన కానీ రికార్డు కాలేదు. మీదు మిక్కిలి మైదాన ప్రాంతాల నుండి అడవిలోనికి వేటకు వచ్చే వారిని చెంచులు తరిమి కొట్టిన సంధర్భాలు కూడా వున్నాయి. నల్లమలలో వున్న పురాతన ఆలయాలను గుప్త నిధుల వేటగాళ్ళ నుండి ఎన్నోమార్లు కాపాడిన ఘనత చెంచులకు వుంది. అయినప్పటికీ ప్రభుత్వం పులుల అభయారణ్యం కోసం చెంచులను వారి సహజ ఆవాసాలకు దూరంగా పునరావాసం పేరిట తరిమి వేసింది. అసలే జన్యు వైవిధ్యం లేక ,పౌష్టికాహార లోపం వల్ల చెంచుజాతి వేగంగా క్షీణించి పోతోంది. అలాంటి విలుప్తమవబోతున్న జాతిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అశాస్త్రీయంగా పులుల సంరక్షణ పేరిట వారు మరింత వేగంగా నశించి పోయే పునరావాస ప్యాకేజ్ కి పాల్పడింది. తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో చెంచులు తిరిగి అడవిలోనికి ప్రవేశించారు. తమదైన అడవిలొ నేడు వారంతా తమది కాని బతుకు బతుకు తున్నారు.
Sunday, February 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
నల్లని బ్యాక్‌గ్రౌండ్ లో చదవడం నాలాంటి వాళ్లకు చాలా కష్టమే మేష్టారు.. కళ్ళు బైర్లు కమ్ముతాయి. కలర్ మారిస్తే చెప్పండి, చదవడానికి ప్రయత్నిస్తాను.
ReplyDeleteనాదికూడా జీడిపప్పు గారి సమస్యే.
ReplyDeleteఅలాగే సార్,
ReplyDeleteనలుపు నిరసనను సూచిస్తుంది. అందుకోసం అలా వుంచా. మారుస్తాను.
_సుబ్బారెడ్డి
Really its an intresting.
ReplyDeleteపద్మార్పితగారు కృతజ్నతలు
ReplyDelete-సుబ్బారెడ్డి
మంచి ఉద్దేశ్యంతో రాస్తున్నారు అభినందనలు. మీ ఆశయాలు సదా నెరవేరాలని ఆకాంక్ష
ReplyDeleteఆత్రేయగారు కృతజ్నతలు.
ReplyDelete-సుబ్బారెడ్డి