Wednesday, February 18, 2009

చెంచులను జంతువుల్లా వేటాడిన ఖాకీలు ... నల్లమల చెంచులు నేడు గాయపడ్డ లేడి కూనలు

వంద కోట్లకు పైబడిన భారత జనాభాలెక్కల్లో తామూ అంకెలమేనని పాపం నల్లమల చెంచులకు తెలియదు.సౌకర్యవంతంగా, స్వేఛ్ఛగా, గౌరవంగా బతికే పౌరహక్కులున్నట్లు వారి కసలే తెలియదు.పొద్దు పొడిచింది మొదలు అడవుల్లో తిరుగుతూ ఆపూటకేది దొరికితేఅది తింటు దొరక్కపోతే పస్తులుండే నిర్భాగ్యపు బతుకులు చెంచులవి.మండే కడుపులో మంట చల్లార్చుకునేందుకు చెంచులు యాప(వేప కాదు) బెరుడును కాల్చి బూడిద చేసి ఆ బూడిదను బాగా తడిపి అందులో చింత పండుకలుపు కుని తింటూ వుంటారు. దీంతో కడుపు మంట చల్లారడమేమో గాని విరేచనాలు పట్టుకుని ఆ అమాయకులు మృత్యు ముఖానికి చేరుకుంటుంటారు. అలాంటి చెంచులు అడవుల్లో అన్నలతో మాట్లాడారనో,వారికి వుపయోగపడారనో పోలీసుల చేత చిత్రహింసల పాలైయ్యారు.అప్పుడప్పుడు బూటకపు ఎన్ కౌంటర్లకు బలవుతూనే వున్నారు. పెచ్చెరువు చెంచు గూడెం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి సుమారు యాభై కిమీ దూరంలో నడి నల్లమలలో ఉంటుంది.అక్షరం ముక్కరాని చెంచుజాతిలో ఆ గూడేనికి చెందిన దాసరి కొడన్న పదవతరగతి వరకు చదవడమంటే గొప్పే. గూడెంలో చౌకధరల దుకాణం నడుపుకునే కొండన్న అటు గూడెం లోను,ఇటు ఆత్మకూరు పట్టణంలోను అందరికి తలలోని నాల్కలాంటివాడు. అడవిలో దారి తప్పిన ఫారెస్టోల్లకైన, పొలపర్లకైనా(కట్టెలు కొట్టుకుని బతికేవారు) కొండన్న నే ఆఅడవిలో అన్నదాత.ఒక్కోసారి అన్నలవేటలో వున్నపోలీసులు బల్వంతంగానైనా కొండన్న ఆతిధ్యం పొందేవారు. అలాగే అన్నలకు అప్పుడప్పుడు అన్నం పెట్టేవాడు.పారెస్టోడో, ఐటిడిఏ వాడో చెంచులకు కించిత్ అఅన్యాయం చేసినా వెంటనే ఆత్మకూరు పట్టణంలోని విలేఖరులకు చేరవేశేవాడు. నెలలునెలలు తన తోటి చెంచులు డబ్బులు ఇవ్వక పోయినా వారికి బియ్యం వుద్దరుగా వేశేవాడు. వారికి వీలు కుదిరి అటవి ఫలసాయం బాగా లభించి వారికి డబ్బులు వచ్చేవరకు వేచి వుండేవాడు.ఎప్పుడు తన జాతి జనం ఎలాబాగు పడతారా అనిమాత్రమే ఆలోచించేవాడు.ఓసారి వరస కరువులొచ్చి గ్రామాల్లోని రైతులే కూడులేక అల్లాడిన రోజులవి.అప్పుడు అడవిలో చెంచులస్థితి మరింత దారుణంగా వుంది. ఈ స్థితిలో కొండన్న వెయ్యి మంది చెంచులను సమీకరించి శ్రీశైలం ఐటిడిఏ కార్యాలయం ముందు ఆకలి ప్రదర్శన నిర్వహించాడు. ప్రతి చెంచు కుటుంబానికి రెండు బస్తాల బియ్యము,బస్తా జొన్నలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటి ఐటిడిఎ పిఒ వాడ్రేవు చినవీరభధ్రుడు ఈ డిమాండ్ ను ఆమోదించ లేదు. ఈస్థితిలో చెంచులకు ఆకలి చావు అనివార్యమయింది. దీన్ని నివారించేందుకు అప్పటి పీపుల్స్ వార్ నాయకత్వం చెంచులకు ఇంటికి బస్తా బియ్యం,బస్తాజొన్నలు ఇవ్వాలని నిర్నయించి అమలు చేయడం కొండన్నకు ప్రాణాంతకంగా మారింది. ఈవ్యవహారంతో కొండన్న పీపుల్స్ వార్ పార్టీ సన్నిహితుడుగా పోలీసులు అనుమానించారు. ఆరోజుల్లొ పోలీసులకు అనుమానం వచ్చిందంటే చాలు ఆజీవికి భూమి మీద నూకలు చెల్లినట్లే. అంగటి సరుకులు కొనడానికి కొండన్న ఒకరోజు ఆత్మకూరుకు వచ్చాడు. పనిలొపనిగా షేవింగ్ చేయించుకుందామని ఓ సెలూన్ లో కూర్చున్నాడు.ఇంతలో ఎవరో ఓ వ్యక్తి సిఐ పిలుస్తున్నాడంటు కొండన్నను పోలీసుస్టేషన్ కు తీసుకు పోయాడు.అంతే ఆ మరుసటి రోజు తెల్లవారు ఝామున పోలీసులకు నక్సలైట్లకు నడుమ జరిగిన ఎదురు కాల్పుల్లో గుర్తుతెలియని ఓ నక్సలైట్ మరణించాడని పోలీసులు చేసిన ప్రకటన వచ్చింది. అప్పటికే ఆందోళనలొ వున్న కొండన్న బంధువులు సంఘటనా స్థలానికి వెల్లగా అక్కడ నెత్తుటి మడుగులో కొండన్న శవం కనిపించింది. ఆహార సేకరణదశ దాటని ఓ ఆదిమ తెగలో సమాజ గతిని అర్థం చేసుకుని తన జాతికొక దిశను చూపాలనుకున్న మనిషిని రాజ్యం కౄరంగా హ్త్య చేసింది. ఇలాంటి సంఘటనల వల్లే చెంచులు తమ కోసం ఎవరో వస్తారని ఎదురు చూసే స్థితికి చేరు కున్నారు. కొండన్న ఒకడే కాడు కొంత తార్కికజ్నానం అలవడిన చెంచులెందరో రాజ్యయంత్రం ఇనుప కాళ్ళాకింద నలిగి పోయారు. ఇలాంటి దశలో చెంచును ప్రగతి వైపు తీసుకు పోయేదెవరు.

5 comments:

  1. ilanti vantini nivarainchadaniki manam em cheyali ????

    ReplyDelete
  2. ఇందు గారు,
    ఏం చేయాలి అని ప్రశ్నవేసుకోవడం మొదలయిందంటే మీరు ఏదైనా చైయ్యాలనుకున్నట్లే కదా. ఆమాత్రపు సహానుబూతి చాలు మా చెంచులకు బయటి ప్రపంచం నుండి మద్దతు సంపాయించేందుకు నేను చేస్తున్న ప్రయత్నం వృధా కాసన్న ధైర్యంకలుగుతుంది.
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  3. సుబ్బారెడ్డి గారూ..! నెనరులు. మంచి వృత్తాంతాన్ని సమాజం దృష్టి కి తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. రాజ్యం చేస్తున్న ఈ హింస ని ఆపే మార్గం లేదా..!? ఎందుకు మన చట్టాలు కొరగానివి అయిపోతున్నాయి? ప్రాణం విలువ ని రాజ్యం ఎందుకు లెక్క చేయటం లేదు? సమాజాన్ని అంధకారం లో ఉంచి రాజ్యం సాధించాలనుకుంటున్నది ఏంటి? ఎంత కాలం ఇలా....!?


    N.B:- If you can, please try put light color background, it will be less strain for eys.

    ReplyDelete
  4. రాజుమల్లోశ్వర్ గారు,
    నాలోని సామాజిక తపన గుర్తించినందుకు కృతజ్నతలు.పీడక రాజ్యాన్నికూలదోసి శ్రేయోరాజ్యాన్ని సాధించడమే మార్గం.పీడన,వేదన,పరాయీకరణ లేని సమాజం కావాలంటే ధృడమైన రాజకీయ సంకల్పం కావాలి.మొదట మన లాంటి వాళ్ళం ఆలోచనలు పంచుకుందాం.
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  5. please send me an email
    kottapali at gmail dot com

    ReplyDelete