Friday, February 20, 2009

పేగు తెంచుకు కాదు.. చెంచులు పేగుదంచుకుని పుడతారు

పేగు తెంచుకు కాదు.. చెంచులు పేగుదంచుకుని పుడతారు
నిజం నల్లమలలో చెంచులు పేగుతెంచు్కోవాలంటే వాళ్ళమ్మ పేగు దంచు కోవలసిందే. నిండు గర్భిణులైనా చెంచుతల్లులు, ఆహార సేకరణలో మగనితో పాటు అడవుల వెంటవెళ్ళాల్సిందే.అలాంటప్పుడు నొప్పులువచ్చి కాన్పు ఆయితే పిల్లను తల్లిని కలిపి ఉంచిన పేగుక్రింద ఒక రాయిని పెట్టి,పైన ఇంకో రాయితో మెల్లగా దంచుతూ ఆచెంచు తల్లి పిల్లవాని ప్రేగు తెంచుతుంది.పగలంతా పొలంలో పత్తి ఒడిపి,గోతానికి కుక్కి,ఆగోతం మోసుకు వచ్చి రైతు ఇంట వేసి ఇంటికి వెళ్ళి ప్రసవించే రైతు కూలి తల్లి చెంచుతల్లి దుస్థితిని చూసి అయ్యో అనుకోవచ్చు.కాని నెలనెలా డాక్టరు ప్రర్యవేక్షణలో పొట్టలోని శిశువు బాగోగులు చూస్తు,కాలు కిందపెట్టనీయని భర్త సేవలో(ఆమె కోసం కాకపోయినా వారసుడికోసం)నెలలునింపుకుని నొప్పులొస్తయేమోనన్న భయంతో ఇంజక్షన్ లు వేయించుకునోకాదంటే సిజేరియన్ ద్వారా సుఖప్రసవం(?) పొందే కార్పోరేట్ తల్లులకు మాత్రం చెంచుతల్లి పేగు దంచుడు జుగుప్స కలిగించితీరుతుంది. మానవ సమాజం చెంచులను కనీసం తోటి మనుషులుగా కూడా గుర్తించకపోవడం వల్లే వారు ఇంతటి దయనీయస్తితిలో నేటికి బతుకు(?)తున్నారు.
ప్రపంచాన్ని మారుస్తామని కనీసం వ్యక్తులుగా తమనుతాము మార్చుకోలేని కమ్యూనిస్టులుకాని,మనుషులతో కాదు మతంతోనే మకు పని అనే కాషాయ వీరులుగాని,గరీబీకాదు..గరీబోంకో హఠావో అనే కాంగ్రేస్ వారు కాని ఎవ్వరూ వీరి వంక చూసిందిలేదు. వీరి బతుకుల్లో ఏదన్నా చిరు మార్పు వచ్చిందంటే శర్మ లాంటి ఒకరిద్దరు ఐటిడిఏ అధికారుల వల్లే. వారిలో పెను మార్పును అభివృధ్దిని కోరుకుని ఆమార్గంలో కొంత ముందుకు నడచిన వన దేవతలను(చెంచుల దృష్టిలో) ప్రజాప్రభుత్వం నల్లమలలోనే లేకుండాచేసింది.ఇక ఇప్పుడు చెంచులకు దేవుడే దిక్కను కోవాలేమో. సిరికింజెప్పక.. శంఖచక్రగధాయుధంబుల కైదోయి సధింపకనే ...నేకుగా అర్తరక్షణకు బయలుదేరడానికి చెంచులలాగే వాళ్ళదేవుల్లు అణగారినవారే. ఈదన్న,ఈరడు మంతనాలమ్మ మొదలయిన వారి దేవతలకు చెంచులు ఏనాడు దూపదీప నైవేద్యమ్ముల నందించిందిలేదు, వారు వీరికి అభయమిచ్చి అదుకుంది లేదు.

2 comments:

  1. parimalam gaaru,
    vooha andangaavundadameta sahajamo vaastavam anta bayankaram gaavuntundi
    -subbaareddy

    ReplyDelete