Tuesday, January 1, 2013

నల్లమల చెంచులపై మళ్ళీ కుట్ర మొదలైంది

నల్లమలకే పరిమితమై దాదాపు విలుప్త దశలో ఉన్న చెంచులు మరోసారి విస్తాపన ప్రమాదం అంచుల్లో
వున్నారు.ఇందుకోసం భారతదళారీ పాలకుల సహకారంతో బహుళ జాతి కంపెనీలు
జాగ్రత్తగా ప్రణాళికలు రచిస్తున్నారు.ఇప్పటికే పులుల అభయారణ్యం పేరిట
నల్లమల నుంచి విస్తాపనకు గురై మైదాన ప్రాంతాలలో మనుగడ సాగించ లేక తిరిగి
అడవి చేరి చెప్పలేనన్ని కష్టాలు అనుభవించిన చెంచులను తిరిగి అడవుల నుంచి
వెల్ల గొట్టే ప్రణాలికలు తయారవుతున్నాయి.


అడవి వదలి వెళితే రూ. 10 లక్షలు :

 చెంచులు అడవి వదలి మైదాన ప్రాంతానికి వెళ్ళితే  18 సంవత్సరాలు నిండిన
ప్రతి ఒక్కరికి రూ.10 లక్షలు ఇస్తామని ఆంద్ర్హప్రదేశ్  అటవి శాఖ  చెంచులను
బెలిపిస్తోంది.   ఇందుకోసం తన వ్యూహంలో భాగంగా  మానసికంగా వారిని ఇందుకోసం
సంసిద్దం చేస్తోంది.  అంతే కాకుండా నల్లమలలో చెంచుల్లో సుమారు 30 స్వంచ్ఛంద
 సేవా సంస్తలు ఇంకా ఆహార సేకరణ దశలోనే ఉన్న చెంచులకు వ్యఫసాయం
నేర్పిస్తున్నామంటూ ఇక్కడ తిష్ట వేసి వున్నాయి. ఈ స్వఛ్ఛంద సంస్తలకు
ప్రధానంగా నిధులు ఎక్కడ నుంచి   వస్తున్నాయో కాస్త ఆరా తీస్తే ఖచ్చితంగా 
వాటి వెనుక ఏదో ఒక  విధేశీ ,స్వదేశి బహుళజాతి సంస్తలకు చెందిన ధార్మిక  
విబాగం ఖచ్చితంగా వుంటుంది . ఈ నేపద్యం మనకు నలమలలో  ఏదో కుట్ర జరుగుతోదన్న
 విషయం స్పష్టం చేస్తుంది.     

నల్ల మలలోని అపార సహజ వనరుల పై  బహుళ జాతి సంస్థల కన్ను :
 
భూగర్భంలో కొన్ని లక్షల సంఫత్సరాల క్రిందట జరిగిన అనేకనేక మార్పుల కారణంగా
ప్రస్తుతం మన దేశంలో ఉన్న దక్కన్  పీఠభూమి ఏర్పడింది.  అప్పట్లో ఒక
జ్వాలాముఖి ప్రేలుడు వల్ల అపారమైన వృక్ష సంపద భూమి అడుగు పొరల్లో చేరింది.
అది కర్బనీకరణ చెంది. అపార  వజ్ర నిక్షేపంలా మారింది. ఇది భూగర్భ
శాస్త్రజ్ఞుల్లో వున్న ఒక అంచనా. ఈ నిక్షేపాలు ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లో
క్రిష్ణా నది నల్లమలలో ప్రవేశించే ప్రాంతమైన సంగమేశ్వర ప్రాంతం నుంచి నది
నల్లమలలను దాటే వరకు ఈ నిక్షేపాలు వున్నాయని అంచనాలు 18వ శతాభ్ధం నుచే
వున్నాయి.ప్రపంచంలోనే నల్లమలలో వజ్ర నిక్షేపాలను భవిష్యత్ అవసరాలకు అట్టి పెట్టింది. కాగా ఇటీవల దక్షిణాఫ్రికాలోని డిభీర్స్ కంపెనీ గనులు వట్టి పోవఛంతో ఆ కంపెనీ తిరిగి నల్లమలలో తన పాత ఒప్పందాలను పునరుద్దరించే పనిలో పడింది.అందులో భాగంగా ఇటీవల నల్లమలపై ఈ కంపెనీ హెలికాఫ్టర్ క్రూష్ణా నది వెంట సర్వే నిర్వ హించింది, 
ఇదే సమయంలో నల్లమల లోని చెంచులను స్వఛ్ఛంధంగా విస్తాపన చేసే ప్రయత్నం    చాపకింద నీరులా సాగిపొతొంది.  ఖనిజ సంపద ఎక్కడ వుంటుందో అక్క డ పాగా వేసి తన కార్య కలాపాలను సాగిస్తూ  అక్కడ ప్రజలలో పలుకుబడి సంపాయించే  ఓ స్వఛ్ఛంద సంస్థ నల్లమలలో చెంచుల ఉద్ధారకుడి పాత్ర పోషిస్తోంది. గుడిసే తప్ప పక్క ఇంటిని ఎనండూ చూడని చెంచులకు ఇళ్ళు కట్టించే యత్నం చేస్తోది. ఇది పైకి  ఎంతో ఆదర్శవంతమైన చర్యగా కనిపించినప్పటికి ఇందులో దారుణమైన కుట్ర దాగుంది. లోతట్టు అడవుల్లో పక్కా  గౄహాలు కట్టడానికి అటవి శాఖ అంగీకరించదు.ఇక్కడ చెంచులకు ఉన్న అటవి హక్కులు ఎందుకు కొరగావు. అడవి అంచుల్లో ఇళ్ళు కట్టుకుందుకు అటవి శాఖ   ఒప్పుకుంటుంది.ఈ వైరుధ్యం వెనుక చెంచులను తెలివిగా అడవులకు దూరం చేసే కుట్ర దాగుంది.ఇదిలా వుండగా డిభీర్స్  సంస్త ఇప్పటికే మహబూబ్ నగర్ లోని గట్టు వంటి నల్లమలకూ దూరంగా వున్న క్రిష్ణా నది తీరంలో వున్న గట్టు    మండలంలో  తమ పని ప్రారంభించింది.నల్లమల అడవులకు సమీపంలో వున్న కొల్లాపురం మండలంలో మద్య దళారులను వుపయోగించి  రెవెన్యూ భూములను కొనుగోలు చేసేందుకు. రూ .40 కొట్లు మన్ననూరు బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఒక్కసారి అంత మొత్తం డిపాజిట్ చేసుకోవడానికి అక్కడి బ్యాంకు మానేజర్ ఒప్పుకోలేదని తెలిసింది. ఇవన్ని వనరుల దోపిడి కోసం  బహుళ జాతి కంపెనీలు,దళారి పాలక వర్గాలు   కలసి చేస్తున్న కుట్రలను తేట్తెల్లం చెస్తోం ది .ఇన్ని కుట్రల నడుమ భారత భూ భాగంలో మిగిలి వున్న తొలి మానవుడి ఆనవాలుగా మిగిలిన చెంచులను కాపాడే నాధుడున్నాడా?