Friday, March 6, 2009

ప్రశ్నించిన వాడికి అంతిమ సంస్కారంపట్టించుకోని వాడికి అకాడమీ పురస్కారం

ఇది నిజం. ఇది కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనిపిస్తూ వినపడు తున్నచరిత్ర సవ్వడి .

’కరువు దెబ్బకు ఆకలి చావులతో పిట్టల్లా రాలిపోతున్నఅడవి బిడ్డలను ఆదుకునే భాద్యత నీది కాదా’ అని ఆ అధికారిని ధిక్కారంగా ప్రశ్నించిందొక స్వరం. ’మాపేరుతో కోట్లు బొక్కి తింటున్నారు.. చావుబతుకుల మద్య ఉన్నమావాల్లకు పిడికెడు బువ్వ పెట్టేందుకు కూడా మీకు మనసు రాదా..’ ఆవేదనను ద్వనించిందొక అడవి కోయిల.మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని భాద్యత గల ఆఅధికారి పట్టించుకోకుండా వెళ్ళి పోయాడు. తను పుట్టిన జాతిపట్ల అధికారి చూపిన నిర్లక్షం ఆచెంచు యువకుడి కడుపు మండించింది.తనతోటి మనుషుల పట్ల పౌర సమాజం ఎందుకింత భాద్యతారాహిత్యంగా వుంటుందో అర్థంచేసుకునే ప్రయత్నం చేశాడు అక్కడి మరో యువకుడు. పై సంఘటణ జరిగి నేటికి సుమారు ఎనిమిది సంవత్సరాలైయింది. నాలుగు రోజుల కిందట కేంద్రప్రభుత్వం ప్రముఖ సాహితివేత్త వాడ్రేవు చినవీరభధ్రుడు రాసిన ఓ రచనకు సాహిత్య అకాడమి అవార్డు ప్రధానం చేసింది. ఆయన ఎవరో కాదు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ(ITDA)ప్రాజెక్ట్ అధికారి. పైన పేర్కొన్న సఘటన జరిగిన సంధర్బంలో పట్టించుకోని అధికారి ఆయనే. శ్రీశైలంలో ITDA కార్యాలయం ముందు వేయి మంది కరువు పీడిత చెంచుల సమక్షంలో వీరబద్రుడును ప్రశ్నించిన యువకులు ఒకరు చెంచు దాసరి కొడన్నకాగా,మరొకరు చెంచుల పట్ల సామాజిక భాద్యతను పాటించిన మైదాన ప్రాంత యువకుడు గొల్ల ఆంజనేయులు. వీరిరువురు ప్రస్తుతం బతికిలేరు. వారు బతకడమ్ చాతకాని వారేమి కాదు,వారిని బతకనీయకూడదని రాజ్యం భావించింది.నల్లమలలో రెండు వేరువేరు సంఘటన్లలో వారిరువురిని రాజ్యం ఎన్ కౌంటర్ పేరిట హత్య చేసింది. వరస కరువులతో అన్నదాతలైన రైతులే అల్లాడి పోతూ వుంటే ప్రతి రోజు అడవిన పడి తిరిగి ఆహారసేకరణ చేసుకునే నలమల చెంచుల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది.ఎవరో ఒకరు ఆదుకోక పోతే వారికి ఆకలిచావులు తప్పని పరిస్థితి. దీంతో అప్పటికే రైతు కూలి ఉద్యమాలలో తలమునకలై ఉన్న చదువుకున్న యువకుడు అంజనేయులు,నిత్యం తనజాతి జనులను ఎలా కాపాడు కోవాలా అని ఆలోచిస్తూ ఉండె దాసరి చెంచు కొడన్నలు మరికొందరు ప్రగతిశీల యువకులతో కలిసి శ్రీశైలంలోని ITDA కార్యాలయం ముందు ధర్నా చేసి చెంచుల సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు పోవాలనుకున్నారు.ఈ కార్యక్రమానికి కనీసం వేయి మందిబాధిత చెంచులను తరలించాలని భావించారు. అంతా అనుకున్నట్లే జరిగింది.అగ్నిగుండంలా మండుతున్న ఏప్రియల్ నెల సూర్య ప్రతాపానికి మగ్గిపోతున్న చెంచులతో మాట్లాడడానికి పరమ మానవతావాదిగా సాహితీ ప్రపంచంలో పేరొందిన వీరభద్రుడికి మనస్కరించలేదు.ఎట్టకేలకు చెంచుల పోరాట పటిమకు వీరభద్రుడు దిగివచ్చాడు. తనరచనలలో అపారమైన మానవీయతను గిరిజనుల పట్ల చూపించే ఆయన వారి సమస్యలు వినలేదు సరికదాకూడా ఏకవచన,దూషన పదజాలంతో కించపరచాడు.ప్రభుత్వ గిరిజన స్టోరు డీలరువై ఉండిఇలాచేస్తావా అంటూ తాను మరచిన భాద్యతను కొండన్నకు గుర్తుచేశాడు. కొండల్లోని చెంచుల తరఫున మాట్లాడడానికి గ్రామానికి చెందిన నీకేం అర్హత ఉందంటూ ఆంజనేయులును బెదరగొట్టాడు.ఎన్నిచెప్పినా చెంచుల్కు సాయంచేయడానికి ససేమిరా అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. అలా ఆనాడు ప్రజల సొమ్ముతో బతుకుతూ వారి సంక్షేమం పట్ల ఏమాత్రం భాద్యత పడని వీరభద్రుడికి సాహిత్యంలో మానవీయ విలువలను పాదుకొల్పినందుకు కేద్రప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డ్ ఇవ్వడం రాజ్యం మానవత్వం మీద వేసిన క్శూరమైన జోకు. ఇలా చెంచుల భాధలకు స్పందించిన కొడన్న, అంజనేయులులు పోలీసుతూటలకు బలి కాగా,బాద్యత మరచిన వీరభద్రుడికి అకాడమి పురస్కారం లభిందడం కుళ్ళిన సమాజపు కంపును ప్రదర్సిస్తోంది

9 comments:

  1. నిజాలు మరుగు పరిచి మానవతా వాదులుగా చలామణీ అవుతున్న మరో మనిషి (??) .సుబ్బారెడ్డి గారు , మీరు వెలుగులోకి తెస్తున్న నిజాలు చదువుతుంటే అసలు ఇంత అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న మన ప్రభుత్వాలకీ , ప్రతినిదులకీ ఇటువంటి ప్రపంచం ఒకటుందని అసలు తెలుసా ?

    ReplyDelete
  2. పరిమళం గారు,
    ప్రభుత్వాలు ఎటూ ప్రజావ్యతిరేకమే అన్న విషయం జనానికి బాగా తెలుసు.కాని తాము గొప్ప మానవతావాదులుగా వేదికలపై అమాయకపు నాగరీకులను మభ్యపెడుతున్న ఆయన లాంటి వాళ్ళ భండారం బయట పెట్టాలి.నిజానికి నేను చెప్పిన యువకులు అతన్ని ప్రశ్నించే సమయంలో నేను వారి వెనుకే వున్నాను.పండితుడైన ఆయన వారితో మాట్లాడిన భాష కూడా పరమ అభ్యంతరంగా వుంది.చెంచుల స్వేఛ్ఛకోసం రాస్తున్న ఈ బ్లాగును కొనసాగిస్తూనే వుంటాను,మీలాంటి వారు నాకు మరింత ప్రోత్సాహం ఇస్తారని భావిస్తాను.
    -సుబ్బారెడ్డి

    ReplyDelete
  3. the people who receive such awards are cowards. Their conscience will prick them every moment they live and they live like corpses.

    ReplyDelete
  4. అక్కడ కిరాయి గురించి రిక్షా వాడితో దెబ్బ లాడుతున్నది ఎవరు?? ఇంకెవరు... ఆ రిక్షా వాడి మీదే కవితలు, రచనలు, కావ్యాలు రాసి బహుమానం పొందాడే .. ఆయనే మరి.

    ReplyDelete
  5. మా చెంచుల భాధలకు సహానుభూతి ప్రకటిస్తున్న మీ అందరికి అభినందనలు
    -సుబ్బారెడ్ది

    ReplyDelete
  6. మీరు చెప్పిన శ్రీశైలం ITDA ఎదురుగా నే మా ఇల్లు.. ఇక్కడ ఉండి వెళ్లిన అందరు ప్రోజెక్ట్ ఆఫీసర్స్ నాకు తెలుసు..కానీ ఇక్కడ ఉన్న అందరూ ప్రోజెక్ట్ ఆఫీసర్స్ లో చెంచుల గురించి ఎక్కువగా కృషి చేసింది వీరభద్రుడు గారే నని అనుకుంటుంటారు. మరి మీ వ్యాసం చదివిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది. కనుమరుగున పడిన నిజాలను వెలికి తీసి ప్రజలకు తెలియచేస్తున్న మీ ప్రయత్నం అభినందనీయం.

    ReplyDelete
  7. మహిగారు,
    ఇటిడిఏ కార్యాలయం ఎదుటే మీ ఇళ్ళయితే మీకు మాచెంచుల ధర్నా గుర్తుండే వుండాలి. అప్పట్లో కాశిం అనే ఈనాడు విలేఖరి పసిపిల్లతో దర్నాకు వచ్చి అలసి నిదుర పోయిన ఓ చెంచిత ఫోటోతో మంచి వార్త రాశాడు. మీరు మా పక్క వూరి వారేనని తెలిసి ఆనందంగా వుంది.అంతే కాకుండా సాంకేతికంగా నేను చాలా పూర్.. నాబ్లాగు చూస్తే మీకు అర్థమై వుంటుంది.మీతో మాట్లాడాలి .అబ్యంతరం లేకపోతే పోన్ చేయండి.(9848032722)
    సుబ్బారెడ్డి

    ReplyDelete
  8. ఇది నిజమా? నేను ఎంతో అభిమానించే వాడ్రేవు చిన వీరభద్రుడు గారేనా ఈ పని చేసింది? నాకసలు మనుషులమీదె నమ్మకము పోతుంది.
    సుబ్బారెడ్డి గారు మీ బ్లాగు చాల బాగుందండి. మీది ఏదన్నా ఆర్గన్య్జషన్ ఉంటె నేను కొంత సహాయము చెయ్యగలను.

    ఇట్లు,
    ఇంద్ర సేనా రెడ్డి

    ReplyDelete