Friday, March 20, 2009
ఆడబతుకు అడవిలోకూడా అన్దతుకె
ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని అంటూఉంటారు.మరి అడవిలోనే పుట్టిన ఆడవాళ్ళ భాధలుఇంకెంత ధారుణంగా ఉన్నాయో కాస్త పరికించండి. తైల సంస్కారమంటే ఏమిటో ఏమో తెలియని జుట్టు,శుచి,శుబ్రత ఎరగని ఒళ్ళు,కాకి పీకడానికి కూడా లేని కండ,ఉతుకు లేని ఉడుపులు ఇది నల్లమలలో నివశించే చెంచు మహిళ ఆకారాధి విశేషాలు.ఇంతటి దీన స్థితిలో ఉన్న చెంచు మహిళ పట్ల కూడా కొందరికి కోరిక కలగడం పైశాచకత్వం కాక మరేమిటి.నాగరికులని పిలువబడే చెంచులు ఎప్పుడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన చరిత్రలేదు. కాని నాగరికులమని జబ్బలు చరుచుకునే వారెందరో చెంచు మహిళలపై పాల్పడిన అత్యాచారాలు అన్నిఇన్ని కావు. అందమైన నల్లమల ప్రాత:సంధ్యా సౌందర్యాన్ని తన హాండీకాంలో చిత్రిస్తున్నాడో సౌందర్యారాధకుడు. ఓపొద చాటున అలజడేదో వ్యూపైండర్ లో అతనికి కనిపించింది.జాగ్రత్తగా చూస్తే బక్క చిక్కిన ఓ చెంచు మహిళను సాయుధుడొకడు బెదిరిస్తూ పొదచాటుకు తీసుకు వెల్తున్న దృశ్యం అతడి కంట పడింది. చెట్టుపై ఉన్న తను కెమెరాను మరింత ఝూం చేసి పులిలా వేటాడి లేడిని పీక్కుతింటున్నట్లున్న ఆభీభత్స దృశ్యాన్ని ఆసాంతం జాగ్రత్తగా చిత్రీకరించాడు.మావోయిస్టుల ఏరివేతకోసం అడవిలోకి వచ్చిన గ్రేహౌండు కూంబింగ్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ ఘాతుకం అలా రికార్డ్ చేయబడింది. నలమలలోని పెచ్చెరువు చెంచు గూడెం పరిసరాల్లో జరిగిన యదార్థ సంఘటన ఇది.ఇంతటి ఘోరానికి సాక్షి అయిన వ్యక్తి ఓ స్వచ్చంద సంస్థకు చెందిన వైద్యుడు.అతడు తన మిత్రుడైన ఓ ప్రముఖ చానల్ విలేఖరి ద్వారా అప్పటి నంద్యాల osd కి తన సజీవ సాక్ష్యాన్ని అమ్ముకోవడం జరిగింది. కర్నూలు లో ప్రజాశక్తిలో పనిచేసిన ఓ మహిళా విలేకరికి ఈవిషయాలు కర్ణాకర్ణిగా తెలిసి విషయ సేకరణకు ఈ బ్లాగరుతో కలిసి ప్రయత్నించినా సాధ్యపడలేదు. అలా నల్లమల చెంచు మహిళపై ఓమానవ మృగం చేసిన అత్యాచారం వెలుగులోకి రాకుండా పూడ్చిపెట్టబడింది.ఇలాంటిదే మరో సంఘటన ప్రకాశం జిల్లా పరిధిలోని బందంభావి చెంచు గూడెంలోజరిగింది. అటవీ ఫలసాయం సేకరణ కోసం ఓ చెంచు దంపతులు అడవిలోకి వెల్లారు. అక్కడ వీరికి కూంబింగ్ పోలీసులు తారసపడ్డారు. వారు ఆచెంచు మిధునాన్నిఅన్నల జాడకోసం చిత్రహింసల పాలు చేశారు.ఆపై ఆ చెంచితను భర్తముందే సామూహిక మానభంగం చేశారు. కొసప్రాణాలతో బయటబడ్డ వారు గట్టిగా రోధించే సాహసం కూడా చేయలేక పోయారు. అయినప్పటికి విషయం ఆనోటా ఈనోటా పడి బాహ్య ప్రపంచం దృష్టిలో పడింది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజా సంఘాలపై గిరిజనులను అవమానపరచారంటూ పోలీసులూ ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద తిరుగమళ్ళ కేసులు నమోదుచేయడం ఓ విడ్డూరం. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో వుండే చెంచు గూడెం నాగలూటి. అక్కడికి వెంకటాపురం గ్రామం సమీపంలోనిదే. ఈగ్రామానికి చెందిన రమణారెడ్డి అనే యువకుడు ఓరోజు నాటిసారా తాగడానికి చెంచు గూడెం వెళ్ళాడు. ఫూటుగాతాగిన రమణారెడ్డి ఉఛ్ఛం నీచం మరచి 50సంవత్సరాల చెంచు పోతమ్మను దారుణంగా మానభంగం చేశాడు. ఆ సమయంలో పొతమ్మ పక్షవాతం వల్ల ఒక కాలు,చేయి పనిచేయై స్థితిలో గుడిసెలో పడిపోయి వుంది. అప్పట్లో ఆంద్రప్రధేశ్ పౌరహక్కుల సంఘం క్రియాశీలంగా వ్యవహరించడంతో పోలీసులు కేసునమోదు చేసి రమణారెడ్డిని జైలుకంపారు. బాధితురాలికి ప్రభుత్వం పరిహారం కూడా ఇచ్చింది. నల్లమల అడవిపుత్రికలు ఇలా మగమృగాల భారిన పడుతూనే ఉన్నారు. పైన ప్రస్తావించినవి మచ్చుకు కొన్ని మాత్రమే.
Subscribe to:
Post Comments (Atom)
మహిళా దినోత్సవాలంటూ ..అందాల పోటీలు ,వక్తృత్వ పోటీలూ నిర్వహిస్తూ స్త్రీలు ఎంతో అభివృద్ది సాధించారని మురిసిపోయే మహిళా సంఘాల వాళ్ళూ ,యాసిడ్ పోసిన కిరాతకుల తరుపున కూడా వకాల్తా పుచ్చుకొని పోరాడే మానవ హక్కుల సంఘం వాళ్ళూ ....ఏమయ్యారు ? చెంచితలు మహిళల్లా ....కనీసం మనుషుల్లా కూడా కనిపించలేదా వాళ్లకు .జంతువులకు కూడా బ్లూ క్రాస్ పేరుతో రక్షణ కల్పిస్తున్నారే మరి వీరికి అండగా ఎవ్వరూ లేరా ? సర్ ! మీ బ్లాగ్ ని ఏదైనా మీడియాకి పరిచయం చేయండి .కనీసం ఎలక్షన్ మూమెంట్ లో అయినా ఓట్లకోసం వారికేమైనా చేయగలరేమో ...ప్రభుత్వమూ ...మరియు పోటీ పడుతున్న మిగతా పార్టీలూ ....
ReplyDeleteహైదరాబాద్ లో ఆఫ్రో-ఏసియన్ గేమ్స్ ముగింపు సంధర్భంగా పోలీస్ అధికార్లు క్యాబరే ప్రోగ్రాంలు పెట్టి ఆడవాళ్ల చేత నగ్నంగా డాన్స్ లు చెయ్యిస్తుంటే మహిళా పోలీస్ అధికార్లు కూడా డాన్సులని సిగ్గు లేకుండా చూసారు. కొన్ని పత్రికలు ఈ విషయం ఫొటో ఆధారాలతో బయట పెట్టినా ఆ పోలీస్ అధికార్లని సస్పెండ్ చెయ్యలేదు. "మేము ఎంత నీతిలేని పనులైనా చేస్తాం, కానీ మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు". ఇది పాలకులు, పోలీసుల నీతి!
ReplyDeleteపరిమళంగారు,
ReplyDeleteచెంచితల దైన్యస్థితి చూసి మీకు ఆవేశం వచ్చింది.ఆ ఆవేశంలో మీరు యాసిడ్ పోసిన కిరాతకులను సమర్తించే అంటూ హక్కుల సంఘాల పై దుమ్మెత్తి పోశారు.మీ ఆవేశం సహజమే.కాని అలాంటి వాళ్ళే చెంచుల కోసం అంతో ఇంతో చేస్తున్నది. చెంచులు బీజరూపంలోనైన చేస్తున్నపోరాటాలవెనుక వున్నదీ హక్కుల సంఘాలే.బందం బాయి చెంచులకు జరిగిన అన్యాయంపై మాట్లాడినందు కు scst కేసుపెట్టించుకున్నది వారే.అసలు విశయం నేనుకూడా 18 సంవత్సరాలుగా ప్రాథమిక హక్కుల భావనను ప్రచారం చేస్తున్నాను
-సుబ్బారెడ్డి
సుబ్బా రెడ్డి గారూ ! క్షమించాలి .నా ఉద్దేశ్యం కిరాతకులకూ ,జంతువులకూ ఉన్న పాటి అండ కూడా అక్కడి వారికి లేదేమోనన్న ఆవేదన తప్ప ఎవరినీ కించపరచాలని కాదు .
ReplyDeleteఅదీ గాక ఒక స్త్రీగా ఆ స్త్రీలపై జరిగిన దురాగతాన్ని చదివి ఆవేశపడిన మాట వాస్తవం .అన్యదా భావించకండి .
ReplyDeletesubbareddy garu,
ReplyDeleteI liked your concern for chenchus. the civil society never considers them as human beings.
By the way, I too liked Purushottam very much!