Wednesday, April 15, 2009
ఇన్నాళ్ళకు చెంచులు ఓటర్లుగానైనా కనిపించారు.
ముందు రాసిన పోస్టులలో నల్లమల చెంచు గూడెం పెచ్చెరువు గురించి ప్రస్తావించి ఉన్నాను.దాదాపు మూడు దశాభ్దాల కిందట పులుల అభయారణ్యం కోసం అడవి నుండి ఖాళీ చేయించబడ్డ గిరిజన గ్రామమది.అడవిలోని ఆగూడెం అలా రెవెన్యూ రికార్డులనుండి మాయమైంది.మైదాన ప్రాంతలోని పునరావాసం ఒంటని చెంచులు తిరిగి అప్పుడే తమ పాత స్థలానికి తిరిగి చేరు కున్నారు.అప్పటి నుండి పెచ్చెరువు చెంచులు అటవీ ఫలసాయం అమ్ముకోవాలన్నా చౌకధరల దుఖాణం వెళ్ళాలన్న నలభై కిమీ నడచి వెళ్ళాల్సి వచ్చేది. అలాగే ఓట్ల కోసం కూడా వారికి ఇదే శ్రమ తప్పేది కాదు. కాకపోతే మరో పూట గురించి ఆలోచించుకోలేని ఆ అడవి బిడ్డలకు ఓట్లు ఎప్పుడు అంత అవసరమైన విషయాలుగా కనిపించేవి కావు.జనాభా లెక్కలకే ఎక్కలేని వారు వోటరు జాబితాకు మాత్రం ఎలా అతుకు తారు. కాగా ఇన్నేళ్ళ తరువాత లెక్కాధాఖలు లేని అటవి గ్రామంలో నివశిస్తున్న చెంచులకు ఓటు యోగం పట్టింది.పట్టుమంటే పాతిక మంది లేని ఆచెంచు గూడెంలో ఎన్నికల కమీషన్ పోలింగ్ బూతు పెట్టబోతోంది.నల్లమలను మావోయిస్టులు లేని ప్రాంతంగా చేశామని ప్రకటించు కొనడంలో భాగంగానే ఈ ఏర్పాటు జరిగినట్టుంది.నట్ట నడిమి నల్లమలలో ఎన్నికలు జరిపించ గలిగామన్న కీర్తి కండూతి అధికారులను ఇందుకు పురిగొల్పి ఉండవచ్చు.ఇరవై మందితో ఓట్లు వేయించుకునేందుకు రెండు వందల మంది పోలీసులనుఇందుకు వినియోగించు కోనున్నారు. ఇవిఎంలను తరలించేందుకు అవసరమైతే హెలికాఫ్టర్ ను ఉపయోగించేందుకు ప్రభుత్వం వెనుకాడక పోవచ్చు.చింతపండును బూడిదలో కలుపుకుని నీళ్ళుపోసి ముద్దచేసుకుని తిని కడుపు నింపుకున్న నాడు అదే చెంచులకు పట్టెడు కరవు బియ్యం అందించలేని వారు నేడు పయిమీద ఇంత బట్టలేని చెంచులతో వోట్లు వేయించేందుకు ఇంత కష్టపడుతూంటే అనుమానం రాకపోతే మనబుర్రలను ఓవర్ హాలింగ్ చేయించుకోవాల్సిందే. కేవలం క్షయలాంటి జబ్బులకే చెంచులు చస్తుంటే పలకరించే దిక్కులేని ప్రభుత్వాలు హెలికాప్టర్ ను ఉపయోగించి ఎన్నికలు జరపాలను కోవడం వెనుక పాలక వర్గ రాజకీయ ఎత్తుగడ ఏది ఉండదనుకోవడం మన అమాయకత్వం కాక మరేమిటి.
Subscribe to:
Post Comments (Atom)
paarlamenTaree raajakIyaala praadhamyaalu teliyani vaaru anukOvaTlEdu. eMdukaMTE meeru kaa.purushOttaM abhimaanini ani cheppaaru. cHattesghaDlO jarugutunna kaansaMTrEshan kyaaMpullaaMTivi ikkadakooDa amaluchEsi viplavakaarulanu oMTari vaaLLanu chEsi ErivEyaDaaniki vEstunna padhakaalE kaLiMgaaMdhra lO kooda talapeTTina Enugula abhayaaranyaM kooDaa. naaku kavitvaM aMTE ishTam. my blog address www.sahavaasi-v.blogspot.com, www.sahacharudu.blogspot.com choodandi.
ReplyDeleteపార్లమెంటరీ రాజకీయాల ప్రాధమ్యాలు తెలియని వారు అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు కా.పురుషోత్తం అభిమానిని అని చెప్పారు. చత్తెస్ఘడ్లో జరుగుతున్న కాన్సంట్రేషన్ క్యాంపుల్లాంటివి ఇక్కదకూడ అమలుచేసి విప్లవకారులను ఒంటరి వాళ్ళను చేసి ఏరివేయడానికి వేస్తున్న పధకాలే కళింగాంధ్ర లో కూద తలపెట్టిన ఏనుగుల అభయారన్యం కూడా. నాకు కవిత్వం అంటే ఇష్టం.
ReplyDeleteవర్మగారు,
ReplyDeleteనేను వ్యక్తిగత కారణాల వల్ల రెందు నెలలుగా ఆఫ్ లైన్ లో వున్నాను. మీ కామెంట్ చదవదం ఆలస్యమైంది. క్షమించగలరు.మిమ్మల్ని మీబ్లాగుల్లో కలుస్తాను.
- సుబ్బారెద్ది
మీరు తాడిపత్రిలో ఉంటున్నారు కదా. మీరు సెలవు పెట్టి నల్లకాలువ వెళ్ళారనుకున్నాను.
ReplyDeletenenu twaralo tirigi naa blognu cont.. chestaanu. tec..problems valla linelo vunda leka potunnaanu. naaku knl..atmakur badili ayyindi.ikkada net vundadu adi samsya..
ReplyDelete-subbaareddy
subba reddy gaaru,
ReplyDeleteyour effort to highlight the problems of chechulu is highly commendable and laudable. My only request is that you please increase the font size of the blog and/or the background. It is very difficult is read what is written and thus we are loosing a great opportunity to learn more about the people about whom there is not much literature available.
thanks,
keerthi
Dear Comrade,
ReplyDeleteRevolutionary wishes for the ''Great October Revolution day''.
- http://vrinternationalists.wordpress.com/
ఇంత చక్కటి బ్లాగు నిర్వహిస్తున్నారు. కాస్త ఫాంట్ సైట్ పెంచండి. బ్లాగులోని ప్రతి వ్యాసమూ కదిలించేలా ఉంది. దయచేసి కొనసాగించండి.
ReplyDeleteబి.ఎస్.ఎన్.ఎల్. వారి రూరల్ బ్రాడ్ బ్యాండ్ పేకేజ్ కి అప్లై చెయ్యండి. లేదా ఆత్మ్మాకూరుకి దగ్గరలో టాటా టవర్ ఉంటే టాటా వైర్ లెస్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోండి. నేను వాడుతున్నది టాటా వైర్ లెస్ పోస్ట్ పెయిడ్ కనెక్షనే. మా ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా లాప్ టాప్ కి యు.ఎస్.బి. వైర్ లెస్ డివైస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది.
ReplyDelete