Tuesday, March 2, 2010
అగ్నిపూల సౌందర్యం _ అంతులేని మాధుర్యం
మా చెంచుల భాధలే కాదు మా నల్లమల అందాలను కూడా మీ ముందుంచాలని సంకల్పించాను.
శిశిరం పచ్చదనానికి శత్రువు. కంటికింపైన వృక్ష సౌందర్యాన్ని నాశనం చేస్తుంది. కాని చెట్లు తిరిగి చిగురిస్తూ ప్రకృతికి ప్చదనాన్ని వాగ్దానం చేస్తూనే వుంటాయి.అయితే పౌరు షానికి ప్రతీకలా నలమలలోని మోదుగ చెట్టు(లత) శిశిరాన్ని నిరశిస్తూ విచ్చు కత్తులలాంటి అగ్నిపూలను వికసిస్తుంది.ఈ మంకెన పూలు ఆకు రాలి మోడువారిన మోదుగ ధర్మాగ్రహాన్ని కొట్టొచ్చినట్లు అల్లంత దూరానికి కనిపించేలా చేస్తాయి.అయితే మాధుర్య సంకలనమే తప్ప భావోద్వేగాలతో నాకేం పని అనుకుంటుందో ఏమో గాని ఈ కాటుక పిట్ట మంకెన పూలలోని మధువును గ్రోలి ఇలా విలాసంగా ఎగురుతోంది.హృదయంతో చూస్తె నలమలలో ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
పునరాగమనానికి స్వాగతం సుబ్బారెడ్డి గారు.
ReplyDeleteమీ టపాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం సుబ్బారెడ్డి గారు.
ReplyDeleteమీరింకా తరచుగా రాయాలి!
ReplyDeleteమిత్రులారా,
ReplyDeleteఅననుకూల పరిస్తితుల వల్ల వెనువెంట నా రాతలు బ్లాగులో చోటు చేసుకోలేక పోయాయి. ఇప్పట్నుంచి నా రాతలకు కోతలుండవు.మిత్రులు మహేష్ సహకారంతో నా బ్లాగును ఆకర్షణీయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.
-సుబ్బారెడ్డి
మీ పునరాగమనం ఆనందదాయకం. అందమైన పోస్ట్ తో మరల మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteనేను ఒకసారి నల్లమల పర్యటించాలనుకుంటున్నాను. ఆత్మకూరులో కానీ నల్లకాలువలో కానీ ATM సెంటర్లు ఉన్నాయా? మా దగ్గర ఉన్నవి ఆంధ్రా బ్యాంక్, HDFC, IDBI ATM కార్డులు.
ReplyDeleteప్రవీణ్ గారు ,
ReplyDeleteఆత్మకూరులొ sbi,ఆంధ్రాబ్యాంక్ ATM లు ఉన్నాయి.అయినా atm లతో పనేమిటి మీరు రావాలి కాని. అడవుల్లో డబ్బుతో అంతగా అవసరముండక పోవచ్చు.
- సుబ్బారెడ్డి
చెంచు గిరిజనుడి ఫొటో బాగుంది. మా దక్షిణ ఒరిస్సాలో కూడా అడవులు ఎక్కువ. అక్కడి గిరిజనులు ఎక్కువగా సవర, కంధ, కొఠియా, కోయ లాంటి జాతులకి చెందినవాళ్ళు. అక్కడ చెంచులు తక్కువ.
ReplyDeleteమీ బ్లాగుని చూడటం ఇదే మొదలు. అడవితల్లి అన్నా, ఆమె బిడ్డలన్నా నాకు అపారమైన అభిమానం, కానీ మీరే ప్రస్తావించినట్లుగా అనేకానేక నిర్బంధాల్లో గడిపే జీవితాలివి. నేను మునుపట్లో చదివిన బాలసాహిత్యం, "దేవభూమి", "కాళికాలయం" వంటి రచనల్లో గిరిజనుల జీవన విధానాలు, సంస్కృతివంటివి తెలిసాయి. అరకు ప్రాంతాల్లో ఒకసారి వారితో గడిపే అవకాశం కూడా కలిగింది. ఇక్కడికిక తరుచూ వస్తుండాలి. మీరు వారి సమస్యలతో పాటుగా, ఇలా అడవుల్లోని ఇతర విశిష్టతలను కూడా పంచుకోగలరని ఆశిస్తూ..
ReplyDeletesubbareddy,we are with u.proceed .gajulamallik
ReplyDelete