Thursday, March 11, 2010

ఆశచూపి బతుకు కూల్చే యత్నం..డబ్బులిచ్చి పారద్రోలేప్రయత్నం

నిర్వాసితం మరణంతో సమానం.పునరావాసం జీవన్మరణ స్తితి. ప్రపంచ వ్యాప్తంగా అభివృధ్ది పేరిట జరుగుతున్న విధ్వంసంలో సమిధలవుతున్న గిరిజనులు మాదిరే నల్లమల చెంచులు కూడా అశాస్త్రీయ పునరావాస బాణానికి గాయపడ్డారు.పులుల అభయారణ్యంలొ మానవ సంచారం వుండరాదంటూ, అడవుల్లో అనాగరికంగా బతుకుతున్నారని వారిని నాగరిక(?) సమాజంలో కలిపేందుకంటూ కారణాలను చూపుతూ రెండున్నర్ర దశాభ్దాల పలు చెంచు గూడేలను ప్రభుత్వం బలవంతంగా తరలించింది. ఇలా చెంచులు మొట్టమొదటి సారిగా తమ సహజ ఆవాసాలకు దూరమయ్యారు.ఈ పునరావాస పథకం చెచుల జీవితాలను ధుర్భరం చేసింది. ఈ ప్రయోగం ఎంతటి వైఫల్యం చెందిందొ ఆత్మకూరు అటవీ డివిజన్ లోని పెచ్చెరువు,రుద్రకోడూరు, పసురుట్ల లాంటి చెంచు గూడాలు సజీవ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ _ శ్రీశైలం పులుల అభయారణ్యం ఏర్పాటుకాగానే మొట్టమొదుట అటవీబహిష్కారం పొందిన చెంచు గూడెం పెచ్చెరువు. వీరికి దట్టమైన అటవి ప్రాంతం నుంచి సుమారు 50కి.మీ దూరంలో వున్న మైదాన ప్రాంతంలోని కొట్టాలచెరువులొ పునరావాసం కల్పించారు.పొలాలిచ్చి దున్నుకోమన్నారు. ఆహారసేకరణ దశ దాటని చెంచులను ఇలా మానవ జీవ పరిణామ క్రమంలోని మలి దశ అయిన వ్యవసాయానికి ప్రభుత్వం ఓ గెంతుతో తీసుకు పోదల్చింది.ప్రభుత్వంతో పాటు గెంతలేని చెంచులు బతుకు కోసం జీవన్మరణ పోరాటం చేసారు.ఈ పోరాటంలో రోగాలు,పౌష్టికాహార లోపాలతో వందలాది మంది మరణించారు. చచ్చినవారు చావగా మిగిలినవారు బతుకు జీవుడా అంటు తమ తొలి ఆవాసమైన పెచ్చెర్వుకు చేరుకున్నారు.కాని అప్పటికే వారి గూడెం రెవిన్యూ రికార్డుల్లో మాయమైంది.ఇలా ఒకప్పటి చెంచుల రాజధాని అయిన పెచ్చెర్వు ప్రస్తుతం చట్ట వ్యతిరేకంగా చెంచులు నివశిస్తున్న ప్రాంతంగా మిగిలి పోయింది.ఇలాగే నాగరిక సమాజపు జీవన్నాన్ని రుచి చూపుతామంటూ ఆత్మకూరు మండలం నల్లకాలువ పరిధిలోని నల్లమలలో వున్న జంట చెంచు గూడాలు రుద్రకోడు,పసురుట్ల లను నల్లకాలువ గ్రామంలో పునరావాసం కల్పించారు.ఐతే అడవిలో దొరికే కాయకసురు ఏరుకుని పట్టణాలలో అమ్ముకుని స్వతంత్ర ఆర్థిక జీవనం గడిపే చెంచులను ఈ పునరావాసం పరాన్నభుక్కులుగా మార్చింది.వరకట్నం,గృహ హింస,వ్యభిచారం,స్వంత ఆస్తి స్వార్థం,వంటి సమకాలీన నాగరిక సమాజపు దిర్వవహారాలు ఏవీ లేని చెంచులు అనతి కాలంలోనే సర్వభ్రష్టత్వం పొందారు. తిరిగి అడవి చేరుకోలేని వీరు నల్లకాల్వలో భిక్సుక వృత్తితో బతుకు తున్నారు.
ఈ పునరావాస వ్యవహారంతో పాఠాలు నేర్చుకోని ప్రభుత్వాలు తిరిగి చెంచులను పనిగట్టుకుని మరోమారు అడవులకు దూరం చేయబోతోంది.ఈ సారి డబ్బుల మూటలతో చెంచులను బెలిపించి వారి అస్తిత్వాన్ని రూపుమాపనెంచింది. పులుల అభయారణ్యంలో వున్న చెంచు కుటుంబాలకు ఒక్కింటికి రూ10 లక్సలు ఇవ్వడం ద్వారా ఈ వ్యవహారం చక్కదిద్ద దల్చింది.ఈ వ్యవహారమంతా చాపకింద నీరులా సాగుతోంది. కానీ మానవ పరిణామ క్రమంలో వేల సంవత్సరాల వెనుకెక్కడో నిలిచిపోయిన జాతిని సంరక్సించే పద్దతి ఇదేనా?.మావోల డంపు దొరికితే అగ్గి పెట్టెకు ఐదువందలిచ్చి కొన్న వెనుకుబాటు చెంచులది.పదికోట్లిచ్చినా అభివృద్ది చెందుతారా. వారి జీవితాలకు సమీకృత అభివృధ్ధి నెనరు కల్గిన అధికారుల పర్యవేక్సణ అవసరమని చెబుతున్న ప్రజాస్వామిక వాదుల మాటలు వినపడతాయా? ప్రముఖ స్వచ్చంద సేవకులు బ్డి శర్మ ఓ సంధర్భంలో మట్లాడుతూ మొక్కను పెరికి నాటితే బతుకుతుంది కాని చెట్టును కాదు అన్నమాటలు మన పాలకుల చెవులకెక్కేదెలా?

4 comments:

  1. avunu, meeru raasindi, ee aksharaala gunde chappudu evarainaa vintunnaraaa???

    ReplyDelete
  2. వసంత గారు,
    ఎక్కడో గల్ఫ్ లో వున్న మీరు వినగలిగారుగా... సంతోషం.మా చెంచులకు కావాల్సింది వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించే సమాజం,హక్కుల కోసం వారి వైపునుంచి రాబోయె పోరాటానికి బాసట.అందుకోసమే నాచిరు ప్రయత్నం.
    _సుబ్బారెడ్డి

    ReplyDelete
  3. మీ వాదనని నేను పూర్తిగా సమర్ధిస్తానండి! మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ....

    ReplyDelete
  4. ఇది నిజమైన అవతార్ పోరాటం. ఆ సినిమాలో లానే మా ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లోని లంజిఘర్ ప్రాంతంలో వేదాంత కంపెనీ వాళ్ళు బాక్సైట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం వలన అక్కడి 8000 మంది కోందు గిరిజనులు నిర్వాసితులవుతున్నారు. ప్రభుత్వాలు వాళ్ళని నాగరికులను చేయడానికో, ప్రధాన జీవన స్రవంతిలో కలపడానికో చేయడంలేదు. అక్కడి సహజవనరులను MNC లకు, పెట్టుబడిదారులకు చౌకగా అమ్ముకోవడానికి, మరియు వారికి మధ్దతు గా పోరాడుతున్న మావోయిస్టులను ఏరివేయడానికి వివిధ ఆదిమ జాతులను వెళ్ళగొడుతోంది. యిప్పుడు ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలో ఏనుగుల అభయారణ్యం పేరుతో ఒక్కో కుటుంబానికి మీరన్న 10 లక్షలు పాకేజీ ప్రకటించి, అక్కడినుండి వెల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కొన్ని వివరాలున్నాయిః http://sahacharudu.blogspot.com/2010/02/blog-post_10.html. మీ కృషి అభినందనీయం.

    ReplyDelete