Wednesday, March 31, 2010

చెరగని మారని శిలాక్షరాలు వారి జీవితాలు

బ్రహ్మ అందరి తలరాతలు రాస్తుంటాడని మన వాళ్ళు నమ్ముతుంటారు. ఆయన రాతలను బట్టే వారి జీవితాలు కొనసాగుతాయని భావిస్తారు.అలాంటి లలాఠ లిఖితమేదో మారని,చెరగని శిలాక్షరమై నల్లమల చెంచుల జీవితాలను నిర్దేశిస్తున్నట్లుంది. ఒకప్పటి చెంచుల రాజధాని గా భావించే పెచ్చెరువు చెంచు గూడెంలో ఆంగ్లేయుల కాలంలోనే మాద్యమిక పాఠశాల తొ పాటు,విధ్యార్థులకు వసతి గృహము ఉండేది. ఒక ఆసుపత్రి,అందులో తగినంత సిబ్బంది ఉండేవారు. ఆవస్తులతో అప్పట్లోనే చెంచులు అటవి శాఖలో ఉన్నత ఉద్యోగాలు పొందారు. నేడు ఈ చెంచుల రాజధాని అసలు రెవెన్యూ గ్రామమే కాదు.పులుల అభయం కోసం పునారావాస వన(మైదాన)వాసాన్ని అనుభవించ లేక చచ్చిన వారు చావగా ఏ కొద్ది మందో తిరిగి తమది కాని తమ గూడెంలో చేరారు.అన్నిహక్కులతో పోరాడితేగాని కదలని ప్రభుత్వాలున్న ఈ రోజుల్లో నివాసహక్కు కోల్పోయిన పెచ్చెర్వు చెంచులకు ప్రభుత్వం అందజేసే సౌకర్యం ఏమాత్రమో మనకర్తమవుతుంది. ఐటిడిఏ దయతలచి ఇస్తున్న అరకొర సాయంతోనే ఈ గూడెం చెంచులు బతుకులు వెల్ల మారుస్తున్నారు. ఈ గూడెంలో ఐటిడిఏ నిర్వహిస్తున్న ఓ గిరిజన వికాస కేంద్రం ఉంది. ఇందులో పని చేసే ఇద్దరు ఉపాద్యాయులు 40 మంది పిల్లలకు అక్షర జ్నానం అందిస్తుంటారు.

అయితే చెంచుల నుదుటి రాతలాగే వీరి పిల్లల అక్షరాభ్యాసం కూడా కఠిన శిలలపైనే సాగుతోంది.పాఠశాలలో పరచిన నాపరాళ్ళపైనే ఈ పిల్లలు అక్షరాలను దిద్దుతూ కనిపిస్తారు.ఒక్క పిల్లవాడికి కూడా పలక బలపం లేక పోవడంతో బండరాల్ల పైనే తమ అక్షర దక్షత చూపుతుంటారు.గతంలో ఈ గూడేనికి చెందిన చెంచు యువకుడు దాసరి కొండన్న మావోయిస్టులతో సంబందాలు(?) కలిగి వున్నాడన్న సమాచారాన్ని ఎక్కడో హైదరాబాదులో వుండే SIB పసిగట్టడం వెంటనే ఎన్ కౌంటర్ లో చంపి వేయడం కూడా రోజుల్లోనే జరిగింది. కాని ఈ గూడెంలో నీళ్ళు లేని కారణంగా ఎవరూ నెలల తరబడి స్నానాలు చేయడం లేదని పెద్దవాళ్ళు అప్పుడప్పుడైనా తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటుంన్నా పసి వారికి ఆభాగ్యం కూడా లేక ఒంటిపై మన్ను పేరుకు పోయి పుడ్లు లేచి రొసికలు కారుతున్న సమాచారం ఏ ప్రభుత్వ అధికారికి అందక పోవడం యాదృఛ్ఛికమైతే కాదు.

ఇదే గూడేనికి చెదిన ఉత్తలూరి గుర్రన్న ఓ తాగుబోతు అంబుల వేటుకు గురి కాగా రొమ్మున దిగిన అమ్ములతో 11గంటలు విలవిలలాడి ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఈ అడవి బిడ్డ ఆర్తనాదం 108 ఆంబులెన్స్ కు చేరడానికి ఆ సమయం పట్టింది.పౌష్టికాహార లోపం వల్ల ప్రతి చెంచు గూడెంలోనూ బుద్ది మాంద్యం ఉన్న పిల్లలు కనపడుతూనే వుంటారు. ఇంతటి సామాజిక వివక్షకు గురవుతున్న చెంచులకు బయటి సమాజపు బుధ్ధి జీవుల మద్దతు అంతగా కనపడదు. వీరి పేరు చెప్పి దండుకునే NGO లు,వీరి పేరిట పద్దురాసి జేబులు నింపుకునే ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రం వీరి చుట్టూ గిరికీలు కొడుతూ ఏదో చేస్తున్న భ్రమలు కల్పిస్తూ ఉంటాయి.అందుకే చెంచులు తమ పోరు తాము చేసుకోగల్గిన స్తైర్యాన్ని కలిగించేందుకు పౌర సమాజం ముందుకు రావాలి.

4 comments:

  1. గిరిజనాభివృద్ధి పేరుతో చందాలు దండుకునే NGOలు మా జిల్లాలో కూడా ఉన్నాయి. ఒక NGO వాడి కోసం వెబ్ సైట్ డిజైన్ చేస్తే వాడు నాకు దొంగ చెక్కు ఇచ్చి మోసం చేశాడు. పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని అంటే అప్పుడు వేరే చెక్కు వ్రాసి ఇచ్చాడు. గిరిజన ప్రాంతాల వెనుకబాటు తనం వల్ల NGOలకి లక్షలు చందాలు వస్తున్నాయి.

    ReplyDelete
  2. please see my post on గిరిజన గోవిందం గ్రీన్ హంట్ లో భాగమె http://sahacharudu.blogspot.com/2010/04/blog-post_10.html

    ReplyDelete
  3. కళ్ళు చెమర్చే నిజాలు రాస్తున్నారు.....చదివి బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయులం !

    ReplyDelete
  4. ee gudem place details telupagalaru.....

    ReplyDelete