Wednesday, March 24, 2010

ఈనిండు గర్భిణి ఒంట్లో చుక్క రక్తం లేదు

నల్లమలలోని చెంచు మహిళలు ధైర్యానికి ప్రతీకలు.పెద్దపులి ఎదుట నిలిచినా,ఎలుగ్గొడ్డు మీదపడినా ఏమాత్రం జంకక వాటితో పోరాడిన చరిత్ర కలవారు.కాని ఈ ధీరలు తీవ్రమైన రక్తహీనతతో సులువుగా తమ ప్రాణాలను మృత్యుకోరలకప్పగిస్తున్నారు.నల్లమలలో దొరికే గడ్డలు తవ్వి తీసి,ఆకులు,అలములు కోసుకుని పొట్టపోసుకునే చెంచు గిరిజనుల ఆహారంలో సహజంగానే పౌష్టిక విలువలు ఉండవు.దీంతో చెంచులను గాలికి రోగాలు తడుముతూనే వుంటాయి.అదుకే TB లాంటి రోగాలకే ప్రాణాలు విడుస్తారు.వీరి సగటు ఆయుర్ధాయం అందుకే 45కు మించదు.ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ఆరోగ్య సమస్యలుండె మహిళలు దారుణమైన స్థితిలో వున్నారు. ఈనెల 22న కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపములోని బైర్లూటి చెంచు గూడెంలో అటవీ శాఖ ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసింది. ఆరోజు ఈ ఒక్క చెంచు గూడేనికి చెందిన 21మంది గర్భిణులను పరీక్షించగా వారంతా తీవ్రమైన రక్త హీనతతో వున్నట్లు గుర్తించారు.వీరిలో ఈ సమస్య ప్రమాదస్తాయి దాటినట్లు కూడా తేలింది. పైన కనపడే చిత్రంలో ఉన్నకుడుముల మంతమ్మ ఎనిమిది నెలల గర్భిణీ. ఈమె పరిస్తితి మరింత ప్రమాదకరంగా వుండడంతో వైద్యులు కర్నూలు సర్వజన వైద్యశాలకు వెళ్ళమని సిఫార్స్ చేశారు. ఆమె అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే స్థోమత వుండి వుంటే మొదట ఆమెకు మంచి ఆహారం తినే అవకాశమే వుడేది.అందువల్ల ఆమెకు ఆ రక్తహీనత వచ్చి వుండేదే కాదు కదా.











ఈ పరిస్థితి ఒక్క బైర్లూటికి సంబందించిందే కాదు. కర్నూలు,మహబూబ్ నగర్,ప్రకాశం,నల్లగొండ,గుంటూరు జిల్లాల పరిధిలోని నల్లమల అడవుల్లో వున్న దాదాపు నలబై వేల చెంచుల్లో సగభాగమైన చెంచితల రగులుతున్న సమస్య.ఆదిమ గిరిజనులైన చెంచుల అభివృధ్ధి సమీకృతంగానే జరగాలని ఐటిడిఎ గా ఏర్పడిన ప్రభుత్వ ఏజెన్సీ ఈ చెంచితల సమస్యను గుర్తించక పోవడం ఇక్కడి విషాదం.

18 comments:

  1. చుక్క రక్తం లేదు
    కాని కడుపు మాత్రం తెచ్చుకుందంటావ్ ..

    :P

    ReplyDelete
  2. @S
    deenni kudaa vekkirinchaalaa... i pity you

    ReplyDelete
  3. @S

    NEEKU OKKA GRAM MEDADU KOODA LEDU.

    ReplyDelete
  4. మిష్టర్ s,
    మిమ్మల్ని నా రాతల్లో వ్యధలు కదిలించలేక పోయాయి.వెటకారానికి ప్రోత్సహించాయి. మీ వ్యాఖ్యకు స్పందించిన వారి వల్ల మీ దృష్టిలోప సమస్య అర్థమయ్యిందను కుంటున్నాను. ప్రపంచమంటే సరదాగా ఈదే ఈత కొలను కాదు. తాడి ఎత్తు ఎగిసే అలలతో పోరు సల్పాల్సిన జీవన సాగరం కూడా
    _ సుబ్బారెడ్డి

    ReplyDelete
  5. Thats a pity! :(

    The culprits for this situation may be their Poverty , Lack of knowledge of sound Nutrition, and also certain better ways of living as marraige and conception at right age.

    Actually there is a lot of awareness that needs to be brought here with regard to these.

    Yeah. I do agree that there is lots of work that needs to go into this at individual level and also at Govt level. They do need help.

    ReplyDelete
  6. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరిట వందల కోట్లు ప్రైవేటు హాస్పిటళ్ళకు దోచిపెడుతోంది.అందులో ఏ వెయ్యో శాతం వీళ్ళ మీద వెచ్చించినా వీళ్ళ సమస్యలు తీరుతాయి.ఈ సమస్యలకు సులభ పరిష్కరం వీళ్ళందరినీ ఒక వోటు బ్యాంకు కింద సమీకరించడం.అప్పుడు ఈ నాయకులు వీళ్ళ చెప్పు కరుస్తా అడిగినవి అన్నీ మంజూరు చేస్తారు.

    ReplyDelete
  7. S :)
    chukka anTE maree chukka ani kaadu.
    Subba Reddy gaariki atiSayOkti ekkuva, telugu dina patrikallO panichEstunTaarEmO!

    ReplyDelete
  8. //తాడి ఎత్తు ఎగిసే అలలతో పోరు సల్పాల్సిన జీవన సాగరం కూడా //
    కవిత్వాలు కథలూ రాసుకోక మీకు జర్నలిజం ఎందుకండి? అలలతో పోరాడతానంటున్నారు - తీరిగ్గా బీచ్ కెళ్ళి రోజూ పోరాడుకోండి.
    చెప్పేది అర్థవంతంగా కాకుండా ' చుక్క నెత్తురు కూడా లేదు, ఆకాశంతో పోరాడుతా , అలలతో పోరాడుతా ' లాంటి పనికిమాలిన పదాలతో డిస్ట్రాక్ట్ చేశారు , కాదా? మీకవిత్వం , పైత్యం తరువాత, మొదట నిజాలు రాయండి, నిజంగా స్పందిస్తాం. ఈనాడు, ఆంధ్రపత్రికల్లో విచిత్రమైన హెడ్డిగులతో అలరిస్తున్నారు అది చాలదా బ్లాగుల్లో కూడానా? ! హయ్యో !

    ReplyDelete
  9. S గారు
    "సినిమా టిక్కెట్ దొరక్కపోతేనో, ప్రేయసి నుండి జవాబు రాకపోతేనో భాధపడే వారు నిజమైన దుఖ్ఖాన్ని తెలుసుకోలేరు" అంటారు బుచ్చిబాబు. కారు మొరాయిస్తె,ఏసి పనిచేయక పోతే,కానిస్టేబుల్ ఓ పది నిముషాలు బండిని ఆపితే కలిగే అసౌకర్యాలే సమస్యలుగా భావించే ప్రపంచంలో, మరో చోట ఎక్కడో కడుపు మాడితే చెట్టు బెరడును కాల్చి చేసుకున్న బూడిదలో చింతపండు వేసుకుని నీళ్ళు కలుపుకుని ముద్దచేసుకు తినే మనుషులున్నారని, వారు మనలాగే ఈ దేశపౌరులేనని ,మనలాగే సౌకర్యవంతమైన జీవనం గడిపే హక్కు వుందని తోటి పౌరులమైన మనం గుర్తించాలన్న ప్రయత్నమే నాది. వాస్తవాలను విడిచి ఊహకు పదాలను నగిషి చేయాలనుకునే తత్వంకాదు నాది. కాలినడకన అడవుల్లో పదుల కిమీ నడుస్తూ వుంటె నాతో పాటుఈదేశ పౌరులైన చెంచులు క్రిమి కీటకాలకంటే హీనంగా బతుకుతుంటె చూసి కడుపు దేవి, కళ్ళు చమరి రాస్తున్న రాతలు నావి.పెట్టుబడికి,కట్టుకతకు పుట్టిన అక్రమ సంతానమైన పత్రికలు ఈ వాస్తవాలను ప్రచురిస్తాయన్న భ్రమలు లేనివాన్ని.అందుకే అంతర్జాలాన్ని నావ్యధ బహిర్గత వేదికగా చేసుకున్నాను. ఏమైతేనేం మీ అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును గౌరవిస్తూ, మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
    =సుబ్బారెడ్డి

    ReplyDelete
  10. వీర అతిశయోక్తులు చూసి ఒళ్ళుమండి కాస్త కటువుగా అన్నానేమో. పినాకపాణి గారు ఇట్టే పట్టేశారు. :)
    హృద్యంగా రాయటానికి అతిశయోక్తులు వాడి కృత్రిమ ఆవేశాన్ని పాఠకుల్లో కలిగించకూడదు, ఆలోచన కలిగించాలి అని నాఉద్దేశ్యం. మీ బాధ, మంచితనం అర్థమయ్యింది. మీ మంచి ఆశయాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను.
    మీరు సరేనంటే , మనం మిత్రులం. :)

    ReplyDelete
  11. @S
    కేవలం ఇటువంటి కామెంట్స్ వ్రాసి, మానసిక ఆనందం పొందడం కోసం మీరు క్రియేట్ చేసిన ఫేక్ బ్లాగర్ ప్రొఫైల్ నేమ్ S(మరియు PinaakaPaani) చాలా బాగుంది. అసలు నిజాలను ప్రక్కనపెట్టి, చెంచుల బాధల వర్ణనలలోని పదాలను అతిశయోక్తులుగా మలుచుకొని విమర్శిస్తున్న మీ తెలివితేటలకు హ్యాట్సాఫ్.

    ReplyDelete
  12. నల్లమల అటవీ ప్రాంత వాసుల దయనీయ స్థితిని బాహ్యప్రపంచానికి తెలియజేసి వారు కూడా మనలాంటి మనుషులే అని చాటి చెప్పే ప్రయత్నం చేసిన సుబ్బారెడ్డి గారిని అభినందించాలో లేక మతిస్థిమితం సరిగా లేని S అలియాస్ Pinaakaapani గారు చేసిన వ్యాఖ్యలకు జాలిపడాలో బోధపడటం లేదు. మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మంచి చేయాలనుకుంటున్న వారిని ఈ విధంగా హేళన చేయడం సంస్కారం అనిపించుకోదు.

    ReplyDelete
  13. చూడండి....
    ‘యస్’ మరియు పినాకపాణి గారూ మీరూ మీ తల్లి యొక్క కడుపు పండించుకొనే (అంటే మీ తల్లికూడా కడుపు తెచ్చుకునే కదా మిమ్మల్ని కన్నది)...కడుపారా మీ తల్లి యొక్క రక్తమాంసాలుతోనే పెరిగి) పురుడు పోసుకొని, కడుపు చించుకుని పుట్టి న మీరు ధైర్యం లేక అనామక పేర్లతో సమాజం ముందు నిలబడలేక అప్రాచ్యపు మాటలు మాట్లాడుతారా...!! ఒక తల్లిలోని దైన్యాన్ని తన రాతల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంటే...మీరు అందులోని ‘‘విషయాన్ని’’ సారాన్ని తీసుకోకుండా....కామప్రవృత్తి పరమైన నీచమైన ఆలోచనతో ఈ విధంగా సంబోధించటం సభ్యసమాజం హర్షించదు. మీరు జన్మస్థలాన్ని కూడా కామ స్థలంగానే చూస్తారని మీ మాటల ద్వారా తెలుస్తుంది. మీలాంటి వారి మాటల వల్ల ఈ సభ్య సమాజం తలదించుకోవలసి వస్తుంది. బట్ మీరన్న మాటలు ఎన్ని లక్షల, కోట్ల మెదళ్ళను కదిలిస్తుందో తెలుసా..? ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో...అక్కడ సమస్త దేవతలు ఉంటారంటారు. మీ దృష్టిలో స్త్రీ అంటే అంత చులకనా...అక్కడ పరిస్థితులు, సదరు బ్లాగరు చెప్పదలచుకున్న ‘విషయ సారాన్ని’ తెలుసుకోకుండా ఈ విధంగా వెటకారంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారా...ఇది మీకు తగునా...
    ఈ భూమి మీద మీరు ఈ విధంగా రక్తమాంసాలతో ప్రాణంతో జీవిస్తున్నారంటే కారణం మీ మాతృమూర్తి. కనుక జ్ఞానచక్షువులను తెరవండి. వళ్ళు దగ్గర పెట్టుకోండి. లేదంటే మీ పాపం ఈ రోజుతో పండినట్లే. ప్రకృతి కన్నెర్ర జేస్తే ప్రళయమే. తస్మాత్ జాగ్రత్త.
    ఏమి ఆశించి సుబ్బారెడ్డి బ్లాగరు గారు ఎంత సమయాన్ని వెచ్చించి వారి వెతలను వెలికితీసి వాస్తవాలను తెలియజేసి వారికి ఏదో రూపంలో ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్ధేశ్యంతో ఉంటే మీరు ఇలాంటి మాటలను వాడి తప్పు చేస్తారా...(అవునులే. తప్పుడు మనుషులకు, తప్పుడు మనసులకు తప్పులోంచే వచ్చినవాశ్ళకు మంచి ఎలా తెలుస్తుంది....?)
    మిత్రమా సుబ్బారెడ్డి గారూ మీకు వివేకానంద స్వామివారే ఆదర్శంగా తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఇలాంటి వాళ్ళు వాగుతారు. ఆపై జోగుతారు. ఆపై అడ్రస్ లేకుండా పోతారు. మీరు మాత్రం గో ఎ హెడ్. మంచి విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్న మీ ఆదర్శానికి మా జోహార్లు.

    ReplyDelete
  14. ఈ S Pinaaka Pani పేరుతో యిలా గిరిజనుల గురించి రాసిన ప్రతి అంశాన్ని వెటకారం చేసి రాయడం జరుగుతోంది. అయినా యిందులో మొదట రాసిన కామెంటుతో యీయన నైజం బయటపడింది. తల్లి కడుపులో చేయి పెట్టే రకంగాడు వీడని. రక్తం తాగి బతికే జాతిగాడని. యిలాంటి మండ్రగబ్బలను లెక్కచేయాల్సిన పనిలేదు.
    మీరు చేస్తున్న కృషి ఎంతో విలువైనది. యిదే దీక్షతో ముందుకు సాగండి సార్. మేమంతా మీ వెన్నంటి వున్నాం. వీడికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు.

    ReplyDelete
  15. Mr.S/Pinaakpani: మీకు ఎదుటివారిపట్ల గౌరవం లేకపోతే లేదని నోరు ముడ్డి మూసుక్కూచో. యిలా లేనిపోని కామెంట్లు రాస్తే మా బాడిత, రంపాలకు పనిచెప్పాల్సి వస్తుంది. నీకు రక్తం విలువ తెలుసా? చీము, నెత్తురున్న వాడివా. సుమన్ గారి కామెంటు చూసైనా బుద్ధి తెచ్చుకో. లేకపోతే అడ్డంగా చెక్కేస్తాం. జాగ్రత్త.

    ReplyDelete
  16. చాలా అన్యాయమైన బతుకులండి వీరివి. మన ప్రధాని మాత్రం తలసరి ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం 10 శాతం అభివృద్ధి సాధిస్తాం.... అని కబుర్లు చెబుతుంటారు. ఇదా మన అభివృద్ధి? ఇటువంటి వార్తలు తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది ఈరోజుల్లో అల్లూరి సీతారామరాజులాంటి విప్లవ వీరులు ఉంటే ఏం చేసేవారో అని?

    ReplyDelete
  17. "ఎప్పుచూ ఆచెంచుల గురించే రాస్తారెందుకు.వాళ్ళేమన్నా మన పేపర్ కొని చదువుతారా? ఒక యాడ్ ఇస్తారా?" అంటూ వెనుకటికి నేను పని చేస్తున్న పత్రిక ఎడిషన్ ఇంఛ్ఛార్జ్ ప్రశ్నించి నపుడే మేధావుల్లో సామాజిక స్పృహ లోపిస్తున్న వాస్తవం నాకు స్పష్తంగా గోచరమైంది.నేడు సమాజం రెండు రకాల మనుషులతో ఉంది.దురదృష్టవశాత్తు ఆలోచించ గలిగినవారు తమ గురించి మాత్రమే అలోచిస్తున్నారు.అసమ సమాజపు నీతికి బలవుతున్నవారు వారి పోరాటం వాల్లే చేసుకోవాల్సిన పరిస్తితి ఉంది. ఈ అవగాహన వున్న నాకు "S"లాంటి వాల్ల ధోరణి అర్థం కానిదేమి కాదు. కాకపోతే ఆయన కామెంట్స్ పై బుద్ది జీవుల్లో ఈస్థాయి ఆగ్రహం వెల్లువెత్తడం సమాజంలో ఒంటి స్థంభం మేడెక్కిన మేధావి వర్గం పట్ల నాకు ఆశలు చిగురిస్తున్నాయి.అందరికి ధన్యవాదాలు. 's'కు మరింతగా కృతజ్జ్ణతలు.
    _సుబ్బారెడ్డి

    ReplyDelete
  18. Mr.S/Pinaakpani:
    రక్తహీనత అన్నది ప్రతీ స్త్రీ కి గర్భం దాల్చినప్పుడు ఉండేదే
    అలాంటప్పుడు వారికి పౌష్ఠిక ఆహారం ఇవ్వడం వల్ల రక్తహీనత తగ్గుతుంది
    పట్టణాలలో అయితే మందుల ద్వారా మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతనుండి బయటపడవచ్చు. అయితే ఇక్కడ అటవి ప్రాంతాలవారు కాబట్టి

    పౌష్ఠిక ఆహారం మరియు సరియైన మందులు దోరకడం కష్టం గనుక వారికి చేతనైన సహయం చేయండి లేదా అందరిలా గమ్మునుండండి

    స్త్రీ నీ ద్వేషించడం ప్రకృతి ని ద్వేషించడం ఒక్కటే

    ReplyDelete