Friday, March 5, 2010
చెంచుజాతి విలుప్త ప్రమాదపు అంచుల్లొ వుంది..మీకెవరికైనా పడుతోందా
కర్నూలు,ప్రకాశం,గుంటూరు,మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి.తూర్పు కనుమల్లో భాగమైన ఈ అడవుల్లో ప్రపంచంలోనే జీవించి ఉన్న అతి పురాతన ఆదిమ గిరిజన తెగ ఐన చెంచులు జీవించి వున్నారు.నేడు చెంచు జనాభ కేవలం ఇరవై వేల లోపు మాత్రమే వుంది.సరైన లెక్కలు తీసి వుంటారనుకోవడం మన భ్రమే.ఒకప్పుడు అధ్బుతమైన జీవన శైలితో నల్లమల రారాజులుగా వెలుగొందిన చెంచులు నేడు వేగంగా పడిపోతున్న తమ జనసంఖ్యను ఎలా కాపాడు కోవాలో తెలియని వెనుకబాటు తనంతో నిష్క్రియాపరత్వంతో వున్నారు.వేలాది సంవత్సరాలుగా జన్యు మార్పిడి లేని జాతి ప్రపంచంలో చెంచులే.అదే ఈ జాతికి శాపంగా మారింది. స్వజాతి పరిధిని దాటని లైంగిక బంధం జాతి ప్రవర్ధనానికి సంకెలగా మారింది.అదే ఈజాతి రోగ నిరోధక శక్తిని హరించింది. నేడు చెంచుల సగటు ఆయుర్ధాయం 45 సంవత్సరాల లోపే.చెంచు చేతిలో చేయి వేస్తే మనకు ఓ జలచరాన్ని స్పర్శించి నట్లు మెత్తగా చల్లగా వుంటుంది. చెంచుల్లో కొందరు కొండ దిగి యానాదులయ్యారు. వీరు చెంచులతో పోలిస్తే కొంత ఆరోగ్యంగాను,ధృడంగానూ వుంటారు. దీనికి కారణం వారిలో వచ్చిన జన్యు వైవిద్యమే. జన్యు వివిధత లేని చెంచు జాతిని TB వెంటాడి హతమారుస్తుంటే సామాజిక పీడన పౌష్టికాహార లోపం జాతి హననానికి కారణమవుతుంది.విలుప్తమవుతున్న జంతువుల పరిరక్సణ కోసం తెగ తాపత్రయ పడే ఆధునిక సమాజం తనతో పాటు పుట్టి జీవన పోరాటంలో అలసి ఓడి పోతున్న సహ మానవ జాతిని కాపాడుకునే ప్రయత్నం చేయక పోవడం తనలోని మానవీయ విలువల పతనాన్ని సూచిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా TB వ్యాధికి చనిపోవడం ఆశ్చర్యమే.
ReplyDeleteచెంచు లక్ష్మిని విష్ణు మూర్తి శ్రీమతిగా ఆరాధించే హిందువులు చెంచు జాతిని నిర్లక్ష్యం చేయటం బాగా లేదు. బొచ్చు కుక్కల కొసం, వీధి కుక్కల కోసం గోల చెసే వన్నెల విసరకర్రలు వీళ్ళ కోసం ఏదైన చేస్తె బావుణ్ణు. సరే, వాళ్ళని వదిలేయండి.మనం ఏం చేయగలమో ఆలోచిద్దాం.
ReplyDeletemaoistlaku aasrayam lekunda cheyalani prabhutvam veellani adavi nundi bayataku pampe kutra chestondi. tama uniki prashnardhakanga marustondi.
ReplyDeleteఆది మానవ మహా ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగిందో తెలుసు కోవ డానికి మిగిలిన ఒక ఆధారం నల్లమల చెంచులు. దక్షిణ ఆప్రికా ఖండంలో మొదలైందని చెప్పబడుతున్న మానవ ఆవిర్భావం దకిణ భారత దేశం మీదుగా కొనసాగిందని ఓ వాదన వుంది.ఆనాటి మానవ మహా ప్రస్తానంలో ఓ మజిలి నల్లమల అని నా భావన.నాటి మనిషి ఆనవాళ్ళు నేటి చెంచుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంతటి పరిశోధక ప్రాముఖ్యమున్న జాతి పట్ల ఈ నిరాధరణ ఎందుకో అర్తం కాదు.
ReplyDelete_ సుబ్బారెడ్డి
సుబ్బారెడ్డి గారికి , పునఃస్వాగతం ! మీ బ్లాగు మార్పు చేర్పులతో...చదవటానికి చాలా అనుకూలంగా ఉంది. మీరు సమస్యను వెలికి తీస్తున్నారు...మీ బ్లాగ్ ద్వారా పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో...లేక మనవంతుగా చేయగలిగిన సాయం ఏమైనా ఉందేమో...ఏది ఏమైనా ప్రభుత్వం కూడా వారి కనీసావసరాలను గుర్తించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి కనీసం ముందు తరాలకైనా చదువు , ఆరోగ్యం అందించగలిగేలా చర్యలు తీసుకోవాలి . అక్కడి చుట్టుపక్కల ఊళ్ళలోని చదువుకున్న యువతీ యువకులు స్వచ్చందంగా వారికి ఆహారం , కలుషిత మంచినీరు , ఆరోగ్యం ...వీటి పట్ల అవగాహన కలిగించడం ...పిల్లలకు ప్రాధమిక విద్యనందించడం వంటివిచేయగలిగితే కొంతవరకు వారికి ఊరటగా ఉంటుందేమో ..
ReplyDeleteపరిమళం గారు,
ReplyDeleteచెంచులకు రికార్డుల్లో ప్రభుత్వం చేయని వసతి,కల్పించని సౌక్ర్యములేదు.ప్రత్యేక ఆసుపత్రులు,పాఠశాలలకు లెక్కేలేదు. అన్ని రికార్డుల్లో,భవనాల రూపంలో భద్రంగానే వున్నాయి. లేనిది ప్రభుత్వ వుద్యోగుల్లో నిజాయితి,నాయకుల్లో చిత్తశుద్ది. ఎనీ హౌ .. మా చెంచుల బ్లా(ధ) గులు చూస్తున్నందుకు ధన్య వాదాలు.
_సుబ్బారెడ్డి