వనవాసాన్ని మరపించని పునరావాసంచెంచుజాతి క్షీణత మరింత వేగవంతం: రాయల్ బెంగాల్ టైగర్ గా పిలుచుకునే పెద్దపులులు దేశంలొ విలుప్తమవుతున్న జాతిగగుర్తించబడడం,చెంచు జాతికి ప్రాణసంకటంగా మారింది.నల్లమలను పులుల ఆవాసకేంద్రంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వము ఐదు జిల్లాల పరిధిలొ దేశంలోనే పెద్దదైన పులుల అభయారణ్యం శ్రీశైలం-నాగార్జునసాగర్ వైల్డ్ లైఫ్ శాక్చురీని ఏర్పాటు చేసింది.సుమారు పదివేల చ.కిమి పరిధి లొ విస్తరించిన తూర్పు కనమలలో భాగమైన నల్లమల అడవుల్లో మూడింట ఒక వంతు పైగానే పులుల అభయారణ్యం కోసం కేటాయించారు.దీంతో నట్టనడిమి నల్లమలలో తమ సహజ ఆవాసాలలో నివశించే చెంచులు తమతమ గూడేలు విడిచి మైదాన ప్రాంతాలకు పునరావాసం పేరిట వెళ్ళాల్సి వచ్చింది. మొక్కను పెరికి నాటితె బతుకుతుంది కాని చెట్టును పెరికి నాటితే బతుకుతుందా? అలాగే ఈ పునరావాసం చెంచుల పాలిటి శాపంగా మారింది.
ప్రభుత్వ ధాఖలాలో మాయమైన గిరిజన గ్రామము: కర్నూలు- గుంటూరు ప్రధాన రహదారిలో ఆత్మకూరు దాటిన తరువాత నలమల లో సుమారు 25km దూరం వెళ్ళాక ఎడమ వైపు ఓ మట్టి రోడ్డు ప్రారంభ మవుతుంది. ఈ దారిలో మరో 30km అడవిలో ప్రయాణం చేస్తే చిన్నిచిన్ని అందమైన గుడిసెలు కనిపిస్తాయి.అది చెంచుల రాజధాని అనదగిన పెద్దచెరువు చెంచుగూడెము. ఈగూడెంలో చెంచులే కాకుండా బోయలాంటి వెనుకబడ్డ కులాలతో పాటు,సుగాలి వంటి మైదాన ప్రాంత గిరిజన తెగల ప్రజలు కూడా ఇక్కడే జీవించేవారు.దాదాపు వెయ్యి మంది జనాభా వున్న ఈగూడేన్ని పులుల అభయారణ్యం కోసం ప్రభుత్వము ఖాళీ చేయించింది. పక్కనే చెరువు,పచ్చని అవాసం, అన్నీ విడిచి అక్కడి జనాభ పెద్దచెరువుకు దాదాపు 60km దూరంలో వున్న కొట్టాల చెరువు అనే మైదాన ప్రాంతానికి ప్రభుత్వముచే తరలించ బడింది. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పెచ్చెరువులో ప్రభుత్వ ఆసుపత్రి, బాలికల వున్నత పాఠశాలను నిర్వహించింది.అటవీ,ఆరోగ్యశాఖల ముఖ్య కార్యాలయాలు ఇక్కడే వుండేవి. అలాంటిది ఏకంగా స్వతంత్ర భారత ప్రభుత్వం మాత్రం నశించి పోతున్న ఓ జంతు జాతిని ఉద్దరించడం కోసం విలుప్త దశలో వున్న మరో ఆదిమ మానవ జాతిని అశాస్త్రీయంగా పునరావాసం పేరిట తమ సహజ ఆవాసాలకు దూరంగా తరలించడంతో చెంచు జాతి మరింత క్షీణించడం మొదలైంది. గుర్తు తెలియని రోగాలతో ఎందరో చెంచులు పునరావాస గ్రామాలలో మరణించ సాగారు.చచ్చినవారు చావగా, మిగిలిన కొందరు తిరిగి తమ పాత గ్రామమైన పెచ్చెరువుకు తిరిగివెళ్ళారు.అప్పటికే రెవెన్యూ గ్రామముగా ప్రభుత్వ రికార్డుల నుండి పెచ్చెరువు తొలగి పోయింది.దీంతో వీరు ఓటుకైనా రేషన్ బియ్యానికైనా 40కి.మీ నడచి వెళ్ళాల్సి వస్తోంది.అసలు మొదటనుండి కూడా ఎలాంటి ప్రభుత్వ లెక్కదాఖలా లేని అటవీ గూడేలు నల్లమలలో ఎన్నో ఉండి చివరకు తమ ఉనికిని కూడా నిలుపు కోలేక కనుమరుగయ్యాయి.ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామ పరిధిలొనినల్లమలలో రుద్రకోడు,పసురుట్ల అనే చెంచు గూడేలుండేవి.ముప్పై సంవత్సరాల క్రిందట అడవిలోని విప్పపూలు,సిరిమాని బంక,ఉసిరి,కుంకుడు కాయలు,చింతపండు,షర్బత్ గడ్డలు సేకరించి అమ్ముకుంటు జీవనం సాగిస్తూ హాయిగా ఉండేవారు. వారిని నాగరిక(?) సమాజంలోనికి తీసుకు వచ్చేందుకు అంటూ ప్రభుత్వం వారిని నల్లకాలువ గ్రామ సమీపంలోకి తీసుకు వచ్చి పునరావాసం కల్పించింది.ఆహారసేకరణ దశలోనే వున్న చెంచులకు వ్యవసాయ భూములందించింది.అయితే సరిగ్గా ముప్పై సంవత్సరాల తరువాత యాభై కుటుంబాలతో వచ్చినవారు పది కుటుంబాలు మాత్రమే బతికి బట్ట(?) కట్టగలిగారు.వీరి భూములు గ్రామాలకు చెందినవారి పాలయ్యాయి.చెంచులు రోజు గ్రామంలో అడుక్కు తిని బతకాల్సి వస్తోంది.స్వంతంగా కాచుకుని సారా సేవించిన వీరు గ్రామాలలో సారా కొని తాగేందుకు డబ్బులు ల కోసం దొంగలుగా మారాల్సి వస్తోంది.వ్యభిచారమంటే ఏమిటో తెలియని వారిలో కేవలం ఒకకప్పు కాఫి కోసం స్వంత భార్యతో వ్యభిచారం చేయించే వారు కూడా బయలు దేరారు.చివరకు 2000రూపాయలకు భార్యలను అమ్ముకునేవారు కూడా ఆజాతిలో తయారయ్యారు.ఇదంతా అశాస్త్రీయమైన పునరావాస ఫలితమేనన్న విషయం ఎందరికి అర్థ మవుతుంది.చెంచుల అభివృధ్దికోసమని ITDA అన్న సంస్థ ఉన్నా అది అందులోపని చేస్తున్న ఉద్యోగులను మాత్రమే కోటీశ్వరులను చేసింది.చెంచుల అభివృధ్ది మాత్రం ఇప్పటికీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందాన మారింది.
Wednesday, January 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment