Sunday, January 11, 2009

నల్లమలలో మానవ జాతి అంతరించి పోతోంది ఎవరికైనా పడుతుందా............ తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అంటే చాలామందికి మావోయిస్టులు,వారిని వెంటాడి వేటాడిన గ్రేహవుండ్ పోలీసుల గురించి మాత్రమే తెలుసు.కాకపోతే కొందరు భావుకులకు దేవులపల్లి భావ కవితా ఝరికి ఆలంబనగా నిలిచిన ప్రక్రుతి రమణీయత గుర్తుకు రావచ్చును. కానీ ఇంకా ఆహారసేకరణ దశలోనే వున్న ఆదిమ గిరిజన తెగ అయిన చెంచులు కేవలం ఈ నల్లమలలో మాత్రమే వున్నారని,వారి జనాభా వేగంగా తరిగి పోతూ ప్రస్తుతం ముప్పై వేలలోపుకు చేరిందని, ఈ పతనం మరింత వేగవంతమై మరో రెండు మూడు దశాబ్దాల లోపే ఈజాతి నిర్మూలనై పోతోందని చాలా మందికి తెలియదు.ఒకప్పుడు స్వయంపోశితంగా ఉన్నత దశ అనుభవించి నేడు ఆకులు రాలినట్లు రాలిపోతున్న ఈ జాతిని తోటి మానవులుగా ఆదుకోవాల్సిన భాధ్యత మన మీద లేదంటారా ? కాని చెంచుల అభివ్రుద్ధి కోసం ఓ ప్రభుత్వ సంస్థ, దాని ద్వారా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించినట్లు కనిపించినా కట్టుకోవడానికి గోచిపాతే వారికి ఇప్పటికీ గతి.ఓ రకం చెట్టు బెరుడును కాల్చి ఆబూడిదలో చింతపండును వేసి నీళ్ళు కలుపుకు తినే పరిస్థితే ఇంకా కొన సాగడం ఎంత అమానవీయం. ఇలాంటి తిండి వల్ల చెంచులలొ సమగ్ర ఆహార లోపం ఏర్పడి అనారోగ్యం పాలై రాలి పోతున్నారు. వేలాది సంవత్సరాలుగా చెంచులలో వర్ణసంకరం జరగక పోవడంతో జన్యువైవిధ్య లేక రోగనిరోధక శక్తిని కోల్పోతున్న వీరికి ముప్పై,నలభై సంవత్సరాలకే నిండు నూరేళ్ళు నిండుతున్నాయి. కర్నూలు,మహబూబ్ నగర్,ప్రకాశం,గుంటూరు,నల్లగొండ జిల్లాలలో విస్తరించిన నల్లమలలో పులుల అభయారణ్యంకోసం చెంచులను పునరావాసం పేరిట వారి ఆవాసాలకు దూరం చేయడంతొ వీరిలో కొంత జననస్టం జరిగింది.తనదైన పారంపరిక సంస్క్రుతి నాశనమైయ్యింది.ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ వల్ల ఇదే పరిస్తితి తలెత్తింది. పాలకవర్గాలనిశ్క్రియాప్రియత్వంతో్జాతిహననానికి గురవుతున్న చెంచుస్వేఛ్ఛకోసం మళ్ళీ మరికొంత సమాచారాన్ని పంచుకుందాం.

1 comment:

  1. First post is promising.. waiting for more posts

    -narayana

    ReplyDelete