Friday, March 20, 2009
ఆడబతుకు అడవిలోకూడా అన్దతుకె
Friday, March 6, 2009
ప్రశ్నించిన వాడికి అంతిమ సంస్కారంపట్టించుకోని వాడికి అకాడమీ పురస్కారం
ఇది నిజం. ఇది కళ్ళకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనిపిస్తూ వినపడు తున్నచరిత్ర సవ్వడి .
’కరువు దెబ్బకు ఆకలి చావులతో పిట్టల్లా రాలిపోతున్నఅడవి బిడ్డలను ఆదుకునే భాద్యత నీది కాదా’ అని ఆ అధికారిని ధిక్కారంగా ప్రశ్నించిందొక స్వరం. ’మాపేరుతో కోట్లు బొక్కి తింటున్నారు.. చావుబతుకుల మద్య ఉన్నమావాల్లకు పిడికెడు బువ్వ పెట్టేందుకు కూడా మీకు మనసు రాదా..’ ఆవేదనను ద్వనించిందొక అడవి కోయిల.మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని భాద్యత గల ఆఅధికారి పట్టించుకోకుండా వెళ్ళి పోయాడు. తను పుట్టిన జాతిపట్ల అధికారి చూపిన నిర్లక్షం ఆచెంచు యువకుడి కడుపు మండించింది.తనతోటి మనుషుల పట్ల పౌర సమాజం ఎందుకింత భాద్యతారాహిత్యంగా వుంటుందో అర్థంచేసుకునే ప్రయత్నం చేశాడు అక్కడి మరో యువకుడు. పై సంఘటణ జరిగి నేటికి సుమారు ఎనిమిది సంవత్సరాలైయింది. నాలుగు రోజుల కిందట కేంద్రప్రభుత్వం ప్రముఖ సాహితివేత్త వాడ్రేవు చినవీరభధ్రుడు రాసిన ఓ రచనకు సాహిత్య అకాడమి అవార్డు ప్రధానం చేసింది. ఆయన ఎవరో కాదు సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ(ITDA)ప్రాజెక్ట్ అధికారి. పైన పేర్కొన్న సఘటన జరిగిన సంధర్బంలో పట్టించుకోని అధికారి ఆయనే. శ్రీశైలంలో ITDA కార్యాలయం ముందు వేయి మంది కరువు పీడిత చెంచుల సమక్షంలో వీరబద్రుడును ప్రశ్నించిన యువకులు ఒకరు చెంచు దాసరి కొడన్నకాగా,మరొకరు చెంచుల పట్ల సామాజిక భాద్యతను పాటించిన మైదాన ప్రాంత యువకుడు గొల్ల ఆంజనేయులు. వీరిరువురు ప్రస్తుతం బతికిలేరు. వారు బతకడమ్ చాతకాని వారేమి కాదు,వారిని బతకనీయకూడదని రాజ్యం భావించింది.నల్లమలలో రెండు వేరువేరు సంఘటన్లలో వారిరువురిని రాజ్యం ఎన్ కౌంటర్ పేరిట హత్య చేసింది. వరస కరువులతో అన్నదాతలైన రైతులే అల్లాడి పోతూ వుంటే ప్రతి రోజు అడవిన పడి తిరిగి ఆహారసేకరణ చేసుకునే నలమల చెంచుల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది.ఎవరో ఒకరు ఆదుకోక పోతే వారికి ఆకలిచావులు తప్పని పరిస్థితి. దీంతో అప్పటికే రైతు కూలి ఉద్యమాలలో తలమునకలై ఉన్న చదువుకున్న యువకుడు అంజనేయులు,నిత్యం తనజాతి జనులను ఎలా కాపాడు కోవాలా అని ఆలోచిస్తూ ఉండె దాసరి చెంచు కొడన్నలు మరికొందరు ప్రగతిశీల యువకులతో కలిసి శ్రీశైలంలోని ITDA కార్యాలయం ముందు ధర్నా చేసి చెంచుల సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకు పోవాలనుకున్నారు.ఈ కార్యక్రమానికి కనీసం వేయి మందిబాధిత చెంచులను తరలించాలని భావించారు. అంతా అనుకున్నట్లే జరిగింది.అగ్నిగుండంలా మండుతున్న ఏప్రియల్ నెల సూర్య ప్రతాపానికి మగ్గిపోతున్న చెంచులతో మాట్లాడడానికి పరమ మానవతావాదిగా సాహితీ ప్రపంచంలో పేరొందిన వీరభద్రుడికి మనస్కరించలేదు.ఎట్టకేలకు చెంచుల పోరాట పటిమకు వీరభద్రుడు దిగివచ్చాడు. తనరచనలలో అపారమైన మానవీయతను గిరిజనుల పట్ల చూపించే ఆయన వారి సమస్యలు వినలేదు సరికదాకూడా ఏకవచన,దూషన పదజాలంతో కించపరచాడు.ప్రభుత్వ గిరిజన స్టోరు డీలరువై ఉండిఇలాచేస్తావా అంటూ తాను మరచిన భాద్యతను కొండన్నకు గుర్తుచేశాడు. కొండల్లోని చెంచుల తరఫున మాట్లాడడానికి గ్రామానికి చెందిన నీకేం అర్హత ఉందంటూ ఆంజనేయులును బెదరగొట్టాడు.ఎన్నిచెప్పినా చెంచుల్కు సాయంచేయడానికి ససేమిరా అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. అలా ఆనాడు ప్రజల సొమ్ముతో బతుకుతూ వారి సంక్షేమం పట్ల ఏమాత్రం భాద్యత పడని వీరభద్రుడికి సాహిత్యంలో మానవీయ విలువలను పాదుకొల్పినందుకు కేద్రప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డ్ ఇవ్వడం రాజ్యం మానవత్వం మీద వేసిన క్శూరమైన జోకు. ఇలా చెంచుల భాధలకు స్పందించిన కొడన్న, అంజనేయులులు పోలీసుతూటలకు బలి కాగా,బాద్యత మరచిన వీరభద్రుడికి అకాడమి పురస్కారం లభిందడం కుళ్ళిన సమాజపు కంపును ప్రదర్సిస్తోంది