Monday, December 24, 2012
మిత్రులు క్షమించాలి చాలాకాలం తరువాత మళ్ళీ మీముందుకు
Monday, September 20, 2010
కొండా..కోనల్లో లోయల్లో..గోదారి గంగమ్మా ఛ్ఛాయల్లో
ఈ గీతం నల్లమల చెంచు బాలలకు చక్కగా అన్వయమవుతుంది. కాకపోతే గోదారి స్థానంలో కృష్ణమ్మనో,చారుఘోషిణినో,గాలేరు వాగునో,మరొ నీటిబుగ్గనో చేర్చుకోవాలి.ఎత్తైన కొడలు..లోతైన లోయలు.. మేఘాలను తాకే మహావృక్షాలూ రాళ్ళను దొర్లించే వేగంతో పారే సెలయేళ్ళు అన్ని చెంచుల బాల్య క్రీడలకు వేదికలే.

అసలు చెంచుల స్వేఛ్ఛాయుత జీవనానికి వారి బాల్యమే మనకు కొండ గుర్తులను సూచిస్తుంది.అమ్మ అవకాశం వుండి వండితే ఆ బువ్వను ఇంత చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్షగా వేసుకుని చెంచుపిల్లలు దబ్బ తొక్కి విడిచిన అంబులా(నారి సారించి విడిచిన బాణంలా)గాలిని చీల్చుకు వెళ్ళే తూనీగలా అడవిలోకి వెళతారు.కడుపులో అత్మారాముడు తిరిగి గోల చేసేవరకు వీరి క్రీడలు సాగుతాయి. ఆటలతోనే వీరి ఆహార సేకరణకూడా సాగుతుంది.టుమికి,చిటిమిటి,ఎలగ ,రేగు,కొండీత,పాల,పరికి,బలస,పేర్లు కూడా తెలియని మరెన్నో జాతుల పండ్లను అడవితల్లి చెంచు పిల్లల కోసం అయా రుతువుల్లో అమర్చి పెట్టె వుంటుంది.కాని నాగరిక ప్రపంచపు దుర్మార్గానికి అడవుల్లోని పళ్ళచెట్లు మయమవుతూ వున్నాయి.లేకపోతే చెంచు పిల్లలు అడవిలో తాము తిన్నన్ని తిని కూడా బయటి సమాజంలోని తమ నేస్తాలకు కూడా వాటిని అందుబాటు(అమ్మకాల ద్వారా)లోకి తెచ్చే వారు.

పచ్చదనపు క్యాన్వా స్ పై ప్రకృతి చిలికిన రంగవళ్ళులలాంటి సీతాకోక చిలుకల వెంట చెంచు పిల్లల పరుగులకు అడ్డు ఆపు వుండదు. ఆపరుగులో గెలిచిన వాడు తాను పట్టిన సీతాకోక చిలుకకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండాదాని రెక్కలపై వుండే బూడిదను వేళ్ళకు పట్టించుకుని నుదుటన వీభూధిలా ధరించి తాను పట్టిన సీతాకోక చిలుకకు స్వేఛ్ఛను ప్రసాదించి,విజయగర్వంతో ముందుకు సాగుతాడు. నల్లమలలోని కొలను భారతి సరస్వతీ క్షేత్రం లో వున్న చారుఘోషిణీ మైదాన ప్రాంతాల వారికి ఇత్తమ గతులను ఇచ్చే తీర్తమే కావచ్చు కానీ ఈ కొండ వాగు మాత్రం చెంచు పిల్లల నల్లని శరీర స్పర్శకు పొంగి పోతుంది. వారిని అప్యాయంగా తడుముతూ మాతృత్వపు తీపిని ఆస్వాదిస్తుంది.కర్నూలు లాంటి నగరాలను వణికించిన తుంగ భద్రమ్మ,కృష్ణమ్మలు సంగమించి నల్లమలలో మహోగ్రంగా ప్రవహించినప్పటికి చెంచు బాలలు సరదా పుట్టి పుట్టిలో నదీ ప్రవేశం చెస్తే వారినే మాత్రం ఇబ్బంది పెట్టకుండా అలలను స్వయం నియంత్రించు కుంటుంది.
పువ్వులాంటి సున్నితత్వం, తూనీగలాంటి స్వేచ్చాప్రియత్వం వున్న చెంచు పిల్లలకు నాలుగు గోడల మద్య నిర్భందంగా విద్య భోదించాలను కుంటే వీలవుతుందా? ప్రస్తుతం నల్లమల చెంచు పిల్లలకు ఇలాంటి అశాస్త్రీయ పద్దతిలోనే ప్రభుత్వం విద్యాసంస్థలను నడుపుతోంది.కొట్లాది రూపాయలు ఖర్చవుతున్నా గత రెండు దశాబ్ధాలలో పది దాటినవారు పది సంఖ్యను ను దాటి వుండరు.

Wednesday, March 31, 2010
చెరగని మారని శిలాక్షరాలు వారి జీవితాలు
బ్రహ్మ అందరి తలరాతలు రాస్తుంటాడని మన వాళ్ళు నమ్ముతుంటారు. ఆయన రాతలను బట్టే వారి జీవితాలు కొనసాగుతాయని భావిస్తారు.అలాంటి లలాఠ లిఖితమేదో మారని,చెరగని శిలాక్షరమై నల్లమల చెంచుల జీవితాలను నిర్దేశిస్తున్నట్లుంది. ఒకప్పటి చెంచుల రాజధాని గా భావించే పెచ్చెరువు చెంచు గూడెంలో ఆంగ్లేయుల కాలంలోనే మాద్యమిక పాఠశాల తొ పాటు,విధ్యార్థులకు వసతి గృహము ఉండేది. ఒక ఆసుపత్రి,అందులో తగినంత సిబ్బంది ఉండేవారు. ఆవస్తులతో అప్పట్లోనే చెంచులు అటవి శాఖలో ఉన్నత ఉద్యోగాలు పొందారు. నేడు ఈ చెంచుల రాజధాని అసలు రెవెన్యూ గ్రామమే కాదు.పులుల అభయం కోసం పునారావాస వన(మైదాన)వాసాన్ని అనుభవించ లేక చచ్చిన వారు చావగా ఏ కొద్ది మందో తిరిగి తమది కాని తమ గూడెంలో చేరారు.అన్నిహక్కులతో పోరాడితేగాని కదలని ప్రభుత్వాలున్న ఈ రోజుల్లో నివాసహక్కు కోల్పోయిన పెచ్చెర్వు చెంచులకు ప్రభుత్వం అందజేసే సౌకర్యం ఏమాత్రమో మనకర్తమవుతుంది. ఐటిడిఏ దయతలచి ఇస్తున్న అరకొర సాయంతోనే ఈ గూడెం చెంచులు బతుకులు వెల్ల మారుస్తున్నారు. ఈ గూడెంలో ఐటిడిఏ నిర్వహిస్తున్న ఓ గిరిజన వికాస కేంద్రం ఉంది. ఇందులో పని చేసే ఇద్దరు ఉపాద్యాయులు 40 మంది పిల్లలకు అక్షర జ్నానం అందిస్తుంటారు.అయితే చెంచుల నుదుటి రాతలాగే వీరి పిల్లల అక్షరాభ్యాసం కూడా కఠిన శిలలపైనే సాగుతోంది.పాఠశాలలో పరచిన నాపరాళ్ళపైనే ఈ పిల్లలు అక్షరాలను దిద్దుతూ కనిపిస్తారు.ఒక్క పిల్లవాడికి కూడా పలక బలపం లేక పోవడంతో బండరాల్ల పైనే తమ అక్షర దక్షత చూపుతుంటారు.గతంలో ఈ గూడేనికి చెందిన చెంచు యువకుడు దాసరి కొండన్న మావోయిస్టులతో సంబందాలు(?) కలిగి వున్నాడన్న సమాచారాన్ని ఎక్కడో హైదరాబాదులో వుండే SIB పసిగట్టడం వెంటనే ఎన్ కౌంటర్ లో చంపి వేయడం కూడా రోజుల్లోనే జరిగింది. కాని ఈ గూడెంలో నీళ్ళు లేని కారణంగా ఎవరూ నెలల తరబడి స్నానాలు చేయడం లేదని పెద్దవాళ్ళు అప్పుడప్పుడైనా తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటుంన్నా పసి వారికి ఆభాగ్యం కూడా లేక ఒంటిపై మన్ను పేరుకు పోయి పుడ్లు లేచి రొసికలు కారుతున్న సమాచారం ఏ ప్రభుత్వ అధికారికి అందక పోవడం యాదృఛ్ఛికమైతే కాదు.
ఇదే గూడేనికి చెదిన ఉత్తలూరి గుర్రన్న ఓ తాగుబోతు అంబుల వేటుకు గురి కాగా రొమ్మున దిగిన అమ్ములతో 11గంటలు విలవిలలాడి ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఈ అడవి బిడ్డ ఆర్తనాదం 108 ఆంబులెన్స్ కు చేరడానికి ఆ సమయం పట్టింది.పౌష్టికాహార లోపం వల్ల ప్రతి చెంచు గూడెంలోనూ బుద్ది మాంద్యం ఉన్న పిల్లలు కనపడుతూనే వుంటారు. ఇంతటి సామాజిక వివక్షకు గురవుతున్న చెంచులకు బయటి సమాజపు బుధ్ధి జీవుల మద్దతు అంతగా కనపడదు. వీరి పేరు చెప్పి దండుకునే NGO లు,వీరి పేరిట పద్దురాసి జేబులు నింపుకునే ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రం వీరి చుట్టూ గిరికీలు కొడుతూ ఏదో చేస్తున్న భ్రమలు కల్పిస్తూ ఉంటాయి.అందుకే చెంచులు తమ పోరు తాము చేసుకోగల్గిన స్తైర్యాన్ని కలిగించేందుకు పౌర సమాజం ముందుకు రావాలి.
Subscribe to:
Posts (Atom)